పురుషుల హాకీ ప్రపంచకప్
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన పూల్-డి మ్యాచ్‌లో నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్‌కు తొలి మ్యాచ్‌లోనే ఓటమి ఎదురైంది. ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ ఆరో ర్యాంక్ జర్మనీ 1-0గోల్స్‌తో 13వ ర్యాంక్ పాకిస్థాన్‌పై విజయం సాధించి టోర్నీలో బోణి కొట్టింది. ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడినా.. మొత్తం మ్యాచ్‌లో ఒకేఒక గోల్ నమోదయింది. 36వ నిమిషంలో జర్మనీ ఆటగాడు మిల్ట్‌కౌ మార్కొ అద్భుతమైన గోల్‌తో జర్మనీ గోల్స్ ఖాతా తెరిచాడు. తర్వాత మరో గోల్ కోసం జర్మనీ.. సమం కోసం పాకిస్థాన్ జట్లు తీవ్రంగా శ్రమించాయి. కానీ మ్యాచ్ పూర్తి సమయం ముగిసే వరకు మరోక గోల్ నమోదు కాలేక పోయింది. దీంతో 1-0తో ఆధిక్యంలో ఉన్న జర్మనీ విజేతగా నిలిచింది.
నెదర్లాండ్స్ చేతిలో మలేషియా చిత్తు
ఇక్కడ జరిగిన పూల్-డి మరో మ్యాచ్‌లో ప్రపంచ నాలుగో ర్యాంక్ నెదర్లాండ్స్ 7-0 గోల్స్ తేడాతో మలేషియాను చిత్తు చేసింది. నెదర్లాండ్స్ తరఫున హెర్ట్‌బర్గ్ హ్యాట్రిక్ గోల్స్ సాధించాడు. ఇతను (11వ, 29వ, 60వ) నిమిషాల్లో గోల్స్ చేసి ఈ ప్రపంచకప్ హ్యాట్రిక్ చేసిన తొలి క్రీడాకారుణిగా రికార్డు సృష్టించాడు. కాగా, మరోవైపు (21వ) నిమిషంలో మైక్రో, (35వ) నిమిషంలో వాన్‌డర్ వీర్డెన్ మింక్, (42వ) నిమిషంలో రాబర్ట్, (57వ) నిమిషంలో బ్రింక్‌మాన్ థెర్రీ గోల్స్ చేశారు. మరోవైపు మలేషియా మ్యాచ్ మొత్తంలో ఒక్క గోల్ కూడా చేయలేక పోయింది. దీంతో నెదర్లాండ్స్ 7-0తో భారీ విజయాన్ని నమోదు చేసుకుంది.
పాకిస్థాన్‌పై జర్మనీ విజయం
RELATED ARTICLES