మౌంట్ మాంగనుయి : ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా టీమిండియా- కివీస్ మధ్య జరిగిన మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా అద్భుతమై క్యాచ్ ఒడిసి పట్టుకున్నాడు. చాహల్ బౌలింగ్‌లో కివీస్ సారథి విలియమ్సన్ 28 వ్యక్తిగత పరుగుల వద్ద ఔటయ్యాడు. 17 ఓవర్లో చాహల్ వేసిన బంతిని ఆడిన విలియమ్సన్.. పాండ్యకు క్యాచ్ ఇచ్చాడు. విలియమ్సన్ బాదిన బంతి పాండ్యా దూరంగా వెళుతున్నా అమాంత స్పైడర్‌మాన్‌లా గాలిలో ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుతమై క్యాచ్ మ్యాచ్‌కు హైలైట్‌గా నిలిచింది. కాగా, పాండ్యాపై ‘కరణ్ విత్ కాపీ షో’లో పాల్గొని అనుచిత వాఖ్యలు చేసినందుకుగానూ రెండే వన్డేలకు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.. అయితే ఇటీవలె ఆ నిషేదాన్ని తొలగించడంతో పాండ్యా ఈ వన్డేలో ఆడాడు. కాగా, పాండ్యా ఈ వన్డేలో బౌలింగ్‌లోనూ రాణించాడు.
https://twitter.com/brainfadesmith/status/1089790010927140864