వారిపై పూర్తిగా నిషేధం విధించాలని నెటిజన్ల డిమాండ్
ముంబయి : టీమిండియా క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, కెఎల్ రాహుల్‌లపై కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (సీఓఏ) చైర్మన్ వినోద్ రాయ్ కఠిన చర్యలకు సిఫారసు చేశారు. ఈ ఇద్దరిపై రెండు వన్డేల నిషేధం విధించాలని ఆయన ప్రతిపాదించారు. అయితే కమిటీలో మరో సభ్యురాలైన డయానా ఎడుల్జీ మాత్రం ఈ అంశాన్ని బిసిసిఐ లీగల్ సెల్‌కు పంపించారు. కాఫీ విత్ కరణ్ షోలో ఈ ఇద్దరు క్రికెటర్లు మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పాండ్యా చేసిన కామెంట్స్‌పై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఇప్పటికే వారిని వివరణ ఇవ్వాల్సిందిగా బిసిసిఐ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. పాండ్యా క్షమాపణ కూడా చెప్పాడు. అయితే అతని వివరణకు తనకు సంతప్తినివ్వలేదని, అందుకే రెండు వన్డేల నిషేధానికి సిఫారసు చేసినట్లు వినోద్ రాయ్ వెల్లడించారు. డయానా కూడా దీనికి ఓకే చెబితే.. ఆ ఇద్దరు ప్లేయర్స్‌ను నిషేధిస్తామని ఆయన చెప్పారు. ఆ ఇద్దరినీ రెండు వన్డేలకు నిషేధించవచ్చో లేదో తెలుసుకోవడానికి డయానా ఈ అంశాన్ని లీగల్ సెల్‌కు రిఫర్ చేశారు. ఆమె అంగీకారం తర్వాత తుది నిర్ణయం తీసుకుంటాం. నా వరకు పాండ్యా చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవి. ఏమాత్రం ఆమోదయోగ్యం కానివి అని వినోద్ రాయ్ స్పష్టం చేశారు. కాగా, మహిళల పట్ల కనీస గౌరవం లేని ఇలాంటి వ్యక్తులు కోట్లాది మంది ప్రేమించే క్రికెట్‌లో కొనసాగడం అనవసరమని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. అందుకే వారిని తక్షణమే క్రికెట్ నుంచి పూర్తిగా నిషేధం విధించాలని చాలామంది నెటిజన్లు తమ స్పందన తెలియజేశారు. పైగా జట్టులో స్థానం కోసం కక్కుర్తిపడి, సచిన్ కంటే కోహ్లీ గొప్పవాడని అంటున్న ఆ ఇద్దరికీ క్రికెట్‌లో కొనసాగే అర్హత లేదని కూడా నెటిజన్లు విమర్శించారు.
పాండ్యా, రాహుల్‌పై రెండు వన్డేల నిషేధం!
RELATED ARTICLES