HomeNewsBreaking News‘పసుపు, ఎర్రజొన్న’ను ప్రభుత్వమే కొనాలి

‘పసుపు, ఎర్రజొన్న’ను ప్రభుత్వమే కొనాలి

బోధన్‌, ముత్యంపేట్‌, సారంగపూర్‌ చక్కెర కర్మాగారం తెరిపించాలి
కమ్మర్‌పల్లి నుండి చేపూర్‌ చేరిన రైతు పాదయాత్ర
ప్రజాపక్షం/కామారెడ్డి జిల్లా ప్రతినిధి బోధన్‌, సారంగపూర్‌, ముత్యంపేట్‌ చక్కెర కర్మాగారం తెరిపించాలని డిమాండ్‌ చేస్తూ జగిత్యాల నుండి ఆర్మూర్‌ వరకు జగిత్యాల రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర కమ్మర్‌పల్లి నుండి శనివారం ఆర్మూర్‌ మండలంలోని చేపూర్‌కు చేరింది. రైతు పాదయాత్రకు చేపూర్‌ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యు లు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకునేందుకు రైతులను పావులుగా వాడుకుంటున్నారని, ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలను పట్టించుకోకపోవడంతో అన్నదాతలు తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. ఒక పార్టీ మరో పార్టీపై దుమ్మెత్తి పోసుకుంటున్నాయని విమర్శించారు. రైతు బాగుంటేనే దేశం బాగుంటుందని, రైతులకు ప్రోత్సాహకా లు అందిస్తే రాష్ట్రంలో రైతాంగం మరింత మెరుగుపడుతుందని సూచించారు. కేంద్రప్రభుత్వం పసుపు రైతుల కోసం ఆర్మూర్‌ ప్రాంతంలో పసుపుబోర్డు ఏర్పాటు చేసి క్వింటాలుకు 15,000 చెల్లించాలని, ఎర్ర జొన్నలను ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి పసుపు, ఎర్రజొన్న రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. జగిత్యాల, ఆర్మూర్‌, బోధన్‌ ప్రాంతాల్లో గతంలో చెరుకు పంటను రైతులు ఎక్కువగా పండించేవారని, బోధన్‌, సారంగపూర్‌, ముత్యంపేట చక్కెర కర్మాగారాలు మూసివేయడంతో రైతులు దిక్కుతోచక ఇతర పంటలవైపు మళ్ళారని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మూతపడ్డ చక్కెర కర్మాగారాలను తెరిపించి రైతులను, కార్మికులను ఆదుకోవాలని కోరారు. ఈ పాదయాత్రలో జిగిత్యాల రైతు ఐక్యవేదిక, రైతు సంఘాల నాయకులు, రైతులు పాల్గొన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments