HomeNewsBreaking Newsపల్లెల్లో ఫైనాన్స్‌ దందా?

పల్లెల్లో ఫైనాన్స్‌ దందా?

యథేచ్ఛగా తాకట్టు, చిట్టీ వ్యాపారాలు…
ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఫైనాన్స్‌ వ్యాపారులు
పట్టించుకునే వారే కరువు
ప్రజాపక్షం / కల్లూరు కరోనా కారణంగా అనేక మంది పేదలు, చిరు వ్యాపారులు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారు. కొంత మందికి పూట గడవని పరిస్థితి. అయితే ఖమ్మం జిల్లా కల్లూరు పేదలు, చిరు వ్యాపారుల అవసరాలను అవకాశంగా తీసుకు ని ఫైనాన్స్‌, తాకట్టు, చిట్టీల వ్యాపారులు వారి దందాను జోరుగా సాగిస్తున్నారు. ఇదే క్రమం లో చిట్టీలు పాడి డబ్బులు తీసుకున్నవారు, వడ్డీకి అప్పులు తీసుకున్నవారు తిరిగి నగదు చెల్లించడంలో ఆలస్యమైతే సంబంధిత ఫైనాన్స్‌ సంస్థల వారు బెదిరింపులకు పాల్పడుతున్నా రు. ఇంట్లో వస్తువులను లాక్కుపోతామని వారు హెచ్చరిస్తున్నారు. కొందరు తాకట్టు వ్యాపారం చేస్తూ అధికంగా వసూలు చేస్తున్నారు. చిరు వ్యాపారుల నుంచి ఆటో డ్రైవర్ల వరకు చిన్న అవసరాలకు మొత్తం డబ్బులు అప్పుగా తీసుకున్న వారి నుంచి అధికంగా వడ్డీ వసూలు చేస్తూ వారిని ఇబ్బంది పెడుతున్నారు.
తెలంగాణలో ఆంధ్రా వ్యాపారులు
ఆంధ్ర వ్యాపారులు తెలంగాణలోని పలు గ్రామాల్లో, పట్టణాలలో ప్రవేశించి సోమవారం నుంచి ఆదివారం వరకు ప్రతి గ్రామంలో వీధి వీధి తిరుగుతూ ఫైనాన్స్‌ ఇస్తున్నారు. ఈ వారం నగదు కట్టలేని పరిస్థితి ఉందని, ఎవరైనా చెబితే వారి పట్ల అసభ్యంగా మాట్లాడుతున్నారని స్థానికులు తెలుపుతున్నారు. స్థానికంగా కొందరు ప్రతి గ్రామం నుంచి 10 మంది ఫైనాన్స్‌ వ్యాపారులు వ్యాపారం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments