రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్
కొత్తగా 1,554 పాజిటివ్‌లు
మరో 9 మంది కొవిడ్‌కు బలి
ప్రజాపక్షం/హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ జిల్లాలకు పూర్తిస్థాయిలో వ్యాపిస్తున్నది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,554 కరోనా వైరస్ కేసులు నమోదవగా, కొత్తగా మరో 9 మంది కరోనాకు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 438కి చేరింది. జిహెచ్‌ఎంసి పరిధిని మినహాయిస్తే దాదాపు 600 కేసులు ఇతర జిల్లాల్లోనే నమోదయ్యాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో బుధవారం 842 కేసులు నమోదుకాగా, రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 132, వరంగల్ అర్బన్ జిల్లాలో 38 కేసులు, మేడ్చల్ జిల్లాలో 96 కేసులు రికార్డయ్యాయి. కామారెడ్డిలో 22 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. వరంగల్ రూరల్‌లో 36 కేసులు బయటపడ్డాయి. అలాగే, కరీంనగర్ జిల్లాలో 73 కేసులు, నల్లగొండలో 51 కేసులు నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లాలో కొత్తగా 24 కేసులు, మెదక్ జిల్లాలో 25, సిద్దిపేట జిల్లాలో 2, వికారాబాద్ జిల్లాలో 1 కేసు నమోదయ్యాయి. ఇవికాకుండా, ఖమ్మంలో 22, మహబూబ్‌నగర్ జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. సూర్యాపేటలో 22 కేసులు నమోదయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 28 కేసులు, రాజన్న సిరిసిల్లలో 18 కేసులు, జోగులాంబ గద్వాల 5, బద్రాద్రి కొత్తగూడెంలో 1, వనపర్తి జిల్లాలో 21 కేసులు నమోదయ్యాయి. నాగర్‌కర్నూల్ జిల్లాలో 14 కేసులు, మంచిర్యాలలో 3 కేసులు నమోదయ్యాయి. పెద్దపల్లిలో 23, యాదాద్రి భువనగిరిలో 8, నిర్మల్‌లో 1, ఆదిలాబాద్‌లో 8, జగిత్యాలలో 3 కేసులు, ఆసిఫాబాద్‌లో 2, ములుగు జిల్లాలో 8, మహబూబాబాద్ జిల్లాలో 11 కేసులు రికార్డయ్యాయి. ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 49,259కి చేరిందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తన హెల్త్ బులిటెన్‌లో ప్రకటించింది. కరోనా వైరస్ సోకిన వారిలో ఇంకా 11,155 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు 37,666 మందిని డిశ్చార్జి చేసినట్లుగా వైద్యఆరోగ్య శాఖ తెలిపింది. బుధవారంనాడు ఒకేరోజు 1,281 మందిని డిశ్చార్జి చేసినట్లు తెలిపింది. కాగా, గడిచిన 24 గంటల్లో నూతనంగా 15,882 శాంపిల్స్‌ను టెస్టు చేయగా, ఇప్పటివరకు మొత్తం 3,08,959 మందికి కరోనా టెస్టులు నిర్వహించారు.
పల్లెల్లో పాగా!
RELATED ARTICLES