ప్రయాణికులతో కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు
రహదారులపై వాహనాల రద్దీ
టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ : రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందడి మొదలైంది. స్కూళ్లు, కాలేజీలకు సెలవులు రావడంతో సొంత ఊరిలో పండుగ జరుపుకునేందుకు ప్రజలు తరలివెళ్తున్నారు. పండుగకు హైదరాబాద్‌తో పాటు ఇతర ముఖ్య నగరాలు, పట్టణాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని తమ సొంతూళ్లకు బయలుదేరిన జనంతో రహదారులపై రద్దీ పెరిగింది. దీంతో జాతీయ రహదారులపై రద్దీ కనిపిస్తోంది. మరోవైపు బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కూడా ప్రయాణికులతో కిటికిటలాడుతున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద శనివారం భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్లో అదనంగా 8 టోల్ బూత్‌లు తెరిచారు. బూత్‌లో ఫాస్ట్ ట్యాగ్ స్కానర్ పనిచేయకపోవడంతో పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకుని వాహనాలను పంపే ఏర్పాటు చేశారు. ఫాస్ట్ ట్యాగ్‌పై అవగాహన లేక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. టోల్గేట్ వద్ద ప్రత్యేకంగా ఫాస్ట్ టాగ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. దీంతో వాహనదారులంతా ఫాస్ట్ టాగ్లను తీసుకుంటున్నారు. మాడ్గుపల్లి, కొర్లపహాడ్ టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాల రద్దీగా బాగా ఏర్పడింది. శనివారం సాయంత్రం నుంచి హైవేలపై వాహానాల రద్దీ పెరిగిందని రవాణా శాఖ అధికారులు చెప్పారు. హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్ధీ పెరిగింది. కీసర టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరడంతో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. కొన్ని టోల్ ప్లాజాల వద్ద వాహానదారులు అసహనానికి గురవుతున్నారు.
పల్లెకు పోదాం!పండుగ చేద్దాం!!
RELATED ARTICLES