న్యూఢిల్లీ: దేశరాజధాని ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని జాతీయ భద్ర తాసలహాదారు (ఎన్‌ఎస్‌ఎ) అజిత్ దోవల్ అన్నారు. ఈశాన్య ఢిల్లీలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న ప్రాంతాల్లో బుధవారం సాయంత్రం ఆయన పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. కొన్ని ప్రదేశాల్లో ఆయనకు ఆదరణ ఎదురైతే, రెండుచోట్ల స్థానికులు ఆయనపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జాఫ్రబాద్‌లో ఓ బాలిక ఆయన వద్దకు వచ్చి తమ ప్రాం తంలో తాము సురక్షితంగా లేమని, విధ్వంసకాండ జరుగుతుంటే పోలీసులు నిష్క్రియగా వ్యవహరించారంది. అప్పుడు ఆయన, ఆమెకు ‘ఇక్కడ అందరికీ సురక్షణ ఉంటుందని నేను మాట ఇస్తున్నాను’ అని భరోసా ఇచ్చారు. అం తేకాక ఆ బాలిక ఇంటికి సురక్షితంగా చేరేలా రక్షణ ఇవ్వాల్సిందిగా పోలీసు సిబ్బందిని ఆదేశించారు. దోవల్ ఈ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, పోలీసులు వారి పని వారు చేస్తున్నారని పేర్కొన్నారు. దీనికి ముందు సీలాంపుర్‌లోని డిప్యూటీ పోలీస్ కమిషనర్(ఈశాన్యం) కార్యాలయంలో ఆయన ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ నెల 23నుంచి ఈశాన్య ఢిల్లీలో సిఎఎ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఘటనల్లో 22 మంది ప్రాణా లు కోల్పోయారు. దీంతో హింసను అదుపు చేసేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా అజిత్ దోవల్‌ను రంగంలోకి దింపింది. మరోవైపు కేంద్ర హోం మంత్రి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక ఇచ్చారు. హింసాత్మక ప్రభావిత ప్రదేశాల్లో పర్యటించి పరిస్థితిని అంచనా వేసిన దోవల్ బుధవారం ఉదయం ప్రధాని నేతృత్వంలోని రక్షణపై ఏర్పాటైన క్యాబినెట్ కమిటీ(సిసిఎస్)కి విషయాన్ని వివరించారు. హింసాకాండను వీలయినంత త్వరగా అణచివేసి సాధారణ పరిస్థితి నెలకొల్పుతానన్నారు. సిసిఎస్‌లో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఉన్నారు.
పరిస్థితి అదుపులో ఉంది: అజిత్ దోవల్
RELATED ARTICLES