HomeNewsLatest Newsపనిముట్లే ఆయుధాలుగా...

పనిముట్లే ఆయుధాలుగా…

అధికార దర్పంతో బిజెపి ‘విమోచన’ దినం

పటేల్‌ చొరవతో హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో మంత్రులు కిషన్‌రెడ్డి , బండి సంజయ్‌

ప్రజాపక్షం/హైదరాబాద్‌
నిజాం నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తమ పని ముట్లనే ఆయుధాలుగా చేసుకుని విరోచిత పోరాటం చేసిన నేపథ్యంలో నాటి హోం మంత్రి వల్లభాయ్‌ పటేల్‌ చొరవతో హైదరాబాద్‌ సంస్థానానికి విముక్తి లభించిందని కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ అన్నారు. కేంద్ర సంస్కృతిక శా ఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో మంగళవారం ‘తెలంగాణ విమోచన దినోత్సవ వేడుక’ను నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అశువుల బాసిన అమరవీరులకు కేంద్ర మంత్రులు బిజెపి నాయకులు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి, హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌, ఒబిసి మోర్చా జాతీయ అధ్యక్షులు ఎంపి డాక్టర్‌.కె.లక్ష్మణ్‌, ఎంపిలు ఈటల రాజేందర్‌, ఎం.రఘునందన్‌రావు, డి.కె. అరుణతో పాటు త్రివిధ దళాల ఉన్నతాధికారులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ విముక్తి పోరాటానికి సంబంధించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, పారా మిలటరీ, రక్షణ దళాల కవాతు నిర్వహించారు. ముందుగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పరేడ్‌ గ్రౌండ్‌లోని అమర జవాన్ల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు సమర్పించి నివాళ్లు అర్పించారు. జాతీయ పతాకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మన దేశానికి 1947 అగస్టు 15 స్వాతంత్య్రం లభిస్తే తెలంగాణకు 13 నెలల తర్వాత 1948 సెప్టెంబర్‌ 17న స్వాతంత్య్రం వచ్చిందని, ఈ విషయం ఈ తరం యువతకు తెలియకుండా గత పాలకులు చరిత్రను తొక్కిపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చరిత్రను ఈ ప్రాంత ప్రజలకు తెలియజెప్పేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు గత నాలుగేళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సం వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని వివరించారు.
బండి సంజయ్‌ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు కేవలం జనవరి 26న గణతంత్ర దినోత్సవం, అగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం మాత్రమే తెలుసని అన్నారు. కానీ తెలంగాణకు అసలైన స్వాతంత్య్రం సెప్టెంబర్‌ 17న లభించిందని , ఈ రోజు మనందరికీ పండుగ రోజు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు స్వాతంత్య్ర సమర యోధులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. అంతకు ముందు తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments