కొత్త ఓటర్లను ఆకర్షించేందుకు యువతను రంగంలోకి దించిన కాంగ్రెస్
‘బెటర్ ఇండియా’ పేరుతో కార్యాచరణ
పకడ్బందీగా అమలు చేయాల్సిందిగా పిసిసి అధ్యక్షులకు రాహుల్ పిలుపు
ప్రజాపక్షం/హైదరాబాద్ : రాబోయే సాధారణ ఎన్నికలలో కొత్త ఓటర్లను ఆకర్షించడానికి కాంగ్రెస్ పార్టీ వ్యూహం ఖరారు చేసింది. ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో ‘బెటర్ ఇండియా’ పేరుతో పెద్దఎత్తున ప్రణాళిక రూపొందించి పనులు చేపట్టింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో మొదటిసారిగా నమోదు చేయించుకున్న 15 కోట్ల మం ది విద్యార్థులు ఓటు హక్కు వినియోగించుకునే వారు ఉన్నారు. వారిని ఆర్షించేందుకు చేయాల్సిన పనులపై ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ విషయమై గురువారంనాడు ఢిల్లీలోని ఎఐసిసి కార్యాలయంలో రాహుల్‌గాంధీతో జరిగిన సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఆర్.సి కుంటియా, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిలు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన ఆపరేషన్ గురిం చి చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ భవిష్యత్తు కార్యాచరణపై వివరించారు. మొదటిసారి ఓటుహక్కు వినియోగించుకుంటున్న వారిని కాంగ్రెస్ వైపు తిప్పుకునేలా చర్యలు చేపట్టాలని అందుకోసం దేశవ్యాప్తంగా పది లక్షల మంది విద్యార్థులను వాలంటీర్లుగా నియమించాలి. అలాగే ‘బెటర్ ఇండియా’ (బెహతర్ భారత్ ) నిర్మాణానికి పిలుపునిచ్చి అందుకు తగిన కార్యాచరణ చేపట్టాలి. దేశంలో వెయ్యిమంది విద్యార్థులకుపైగా ఉన్న కళాశాలలను ఎంపిక చేసుకోవాలని, అక్కడ విద్యార్థులకు కరపత్రాలు పంపిణీ చేయడం, వాలంటీర్లను నియమించడం, మేనిఫెస్టోకు సంబంధించి విద్యాసంబంధ అంశాలపై వారి నుంచి సమాచారం సేకరించడం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు విద్యార్థులతో చర్చించడం, ‘రన్ ఫర్ బెటర్ ఇండియా’, ‘బెటర్ ఇండియా ఫెస్టివల్స్’ లాంటివి చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సామాజిక మాధ్యామాలను విరిగిగా ఉపయోగించాలని, బెటర్ ఇండియాకు సంబంధించి షార్ట్‌ఫిల్మ్ లను నిర్మించడం, ‘బెటర్ ఇండియా’ కోసం మంచి ఆలోచనలు చేయడం, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలులాంటి వాటితో పాటు చేయి చేయి కలుపుదాం లాంటి కార్యక్రమాలను భారీగా రూపొందించాలని రాహుల్ సూచించారు.