శివసైనికుడే సిఎం కావాలి
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ప్రకట
తిరుగుబాటు మంత్రి షిండేకు 46 మంది మద్దతు?
బిజెపి పాలిత గువహటిలో మకాం
సంక్షోభ సమయంలో సిఎం, గవర్నర్‌లకు కరోనా
అసెంబ్లీ రద్దు దిశగా పరిణామాలు !
ముంబయి : మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడీ (ఎంవిఎ) సంకీర్ణ కూటమి ప్రభుత్వంలో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. తిరుగుబాటు చేసిన సీనియర్ మంత్రి, శివసేన సైనికుడు ఏక్‌నాథ్ షిండే (46) కు 46 మంది శాసనసభ్యులు మద్దతు పలికారని ఒక సమాచారం. ఆయనను తమ సొంత తిరుగుబాటు బృందం తరపున తమ చీఫ్ విప్‌గా, తమ పక్ష నాయకుడుగా ఎన్నుకున్నారు. ఒక అసహజమైన సంకీర్ణ కూటమి (ఎన్‌సిపి, శివసేన, కాంగ్రెస్)నుండి శివసేన ఎంఎల్‌ఎలు అనివార్యంగా బయటపడవలసిన అవసర ఉందని బుధవారం రాత్రి షిండే ప్రకటించంతో ఎంఎల్‌ఎలతో కూడిన కొత్త చీలిక కూటమి బిజెపితో జత కలపడం ఖాయంగా కనిపించే పరిస్థితులు నెలకున్నాయి. ఈ పరిణామాలతో అసెంబ్లీలో మెజారిటీ కోల్పోయిన విషయం ఎంవిఎ కూటమికి స్పష్టంగా అర్థం కావడంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే రాజీనామాకు సిద్ధపడ్డారు. తనకు మద్దతు ఇస్తే తానను ముఖ్యమంత్రి పదవి నుండి వైదొలగుతానని ట్విస్ట్ ఇచ్చారు. తన స్థానంలో మరో శివసైనికుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవడం తనకెంతో సంతోషం కలిగించే విషయమని ఆయన అన్నారు. సానుకూల దృక్పథంతో తిరుగుబాటు ఎంఎల్‌ఎలను దార్లోకి తెచ్చేందుకు థాక్రే శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తున్నది. ఎంవిఎ కూటమిని అవినీతి ప్రభుత్వంగా అభివర్ణిస్తున్న తిరుగుబాటు ఎంఎల్‌ఎలు తమ వైఖరిని సడలించే పరిస్థితి కనిపించడంలేదు. పైగా వారంతా మరో బిజెపి పాలిత రాష్ట్రం అసోం రాజధాని గువహటికి తమ మకాం మార్చారు. ఈ పరిణామాలు స్పష్టంగా బిజెపితో కలిసి కొత్త ప్రభుత్వం ఏర్పాటుకే దారితీసేలా ఉన్నాయన్న సంకేతాలు కనిపిస్తుండగా మరోవైపు ఎంవిఎ కూటమి అసెంబ్లీ రద్దు ఆలోచన చేస్తున్నది. దీంతో మహారాష్ట్ర రాజకీయాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయాయి. ప్రస్తుత పరిణామాలు అసెంబ్లీ రద్దుకు దారితీసేవిగా ఉన్నాయని ముఖ్యమంత్రి సన్నిహితుడైన శివసేన ఎంపి సంజయ్ రౌత్ అన్నారు. ఈ మేరకుఆయన ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి రాజీనామా చేస్తారా అన్న పాత్రికేయుల ప్రశ్నలను ఆయన దాటవేశారు. అదే సమయంలో ముఖ్యమంత్రి థాక్రేకు బుధవారంనాడు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ (80) కు కరోనా సోకింది. అయితే ఆయన స్వల్ప లక్షణాలతో బుధవారనాడు ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. తనకు కరోనా సోకిందని ఆయన వీడియో సందేశంలో తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో థాక్రే ఏకాంతవాసంలో ఉంటూ దృశ్యమాధ్యమ పద్దతిలో మంత్రివర్గ సహచరులతో సంభాషణలు కొనసాగిస్తున్నారు. తనకు ముఖ్యమంత్రి పదవిమీద వ్యామోహం లేదని, శరద్ పవార్ తనను ముఖ్యమంత్రిగా ఉండమని
తనకు మద్దతు ఇస్తే రాజీనామాకు తాను సిద్ధంగా ఉన్నాని థాక్రే తిరుగుబాటు ఎంఎల్‌ఎలు, మంత్రులైన శివసైనికులను ఉద్దేశించి ఒక సందేశంలో తెలియజేశారు.తాను బాల్ థాకరే కుమారుడిననీ, పదవికోసం ఆశపడటం లేదని, తన తర్వాత తిరిగి ఈ ప్రభుత్వంలో శివసైనికుడే ముఖ్యమంత్రి పదవిని అలంకరిస్తే తాను ఎంతో సంతోషిస్తానని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు.హిందుత్వ సిద్ధాంతాలను తాను విడనాడలేదని కూడా శివసైనికులకు ఆయన స్పష్టం చేశారు. హిందుత్వ అనేది శివసేన ఊపిరిని, దాని నుండి దూరంగా జరగలేదు అని ఆయన పేర్కొన్నారు.
“మీరు ఎక్కడో సూరత్‌లోనో మరొకచోటో కూర్చుని ఎందుకు మాట్లాడటం? నా దగ్గరకు రండి, నాతో వచ్చి మాట్లాడండి, నేను పార్టీ అధ్యక్షపదవికిగానీ, ముఖ్యమంత్రి పదవికి గానీ పనికిరారనీ, అసమర్థుడననీ మీలో ఏ ఒక్కరు చెప్పినాగానీ రెండు పదవుల నుండీ వైదొలగుతా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తా, రాజీనామా లేఖ నా దగ్గర సిద్ధంగా ఉంది, మీరు నా దగ్గరకు వచ్చి మాట్లాడి ఆ లేఖను నా దగ్గర నుండి తీసుకుని నేరుగా మీరే రాజ్‌భవన్‌కు వెళ్ళి గవర్నర్‌కు సమర్పించండి” అని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. ఆయన ఈ మేరకు ఫేస్‌బుక్ ద్వారా ఇచ్చిన 18 నిమిషాల నిడివిగల ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. గత ఏడాదిలో ఆయన వెన్నుముక చికిత్స చేయించుకున్నారు. దాంతో ప్రజలను కలుసుకోకుండా ఏడాదిపాటు దూరంగా ఉన్నారు.
ఎంవిఎ కూటమి అవినీతిమయం
తిరుగుబాటు ఎంఎల్‌ఎల ధ్వజం
నిన్న మంగళవారంనాడు తిరుగుబాటు చేసిన షిండేకు 35 మంది ఎంఎల్‌ఎలు మద్దతు తెలియజేయగా బుధవారంనాడు ఆయనకు మద్దతు తెలియజేసిన ఎంఎల్‌ఎలు, మంత్రుల సంఖ్య 46కు పెరిగింది. షిండే ఈ మేరకు ప్రకటన చేశారు. వీరంతా సూరత్‌లో మకాం వేయగా తాజాగా బిజెపి పాలిత ఈశాన్యరాష్ట్రం అసోంలోని గువహటికి మకాం మార్చారు. మహా వికాస్ అఘాడీ అవినీతిమయమైపోయిందని బిజెపి తరహాలోనే వారు విమర్శలు గుప్పించారు.థాక్రే ముఖ్యమంత్రిగా కొనసాగేదుకు ఇష్టపడటం లేదని తిరుగుబాటు ఎంఎల్‌ఎలు కరాఖండీగా స్పష్టం చేశారు. శివసేనపార్టీ ఒక బలమైన పరిణతి చెందిన రాజకీయపార్టీగా అభివృద్ధి చెందడంలో విఫలమైందని వారు విమర్శించారు. అందుకే తాము షిండేకు మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రస్తుతం 46 మంది సంతకాలుచేసి నన్ను పక్ష నాయకుడుగా ఎన్నుకున్నారు, ఇంకాతమకు బలం ఉంది, మరింతమంది ఎంఎల్‌ఎలు వచ్చి చేరతారు అని షిండే పేర్కొన్నారు. 287 మంది ఎంఎల్‌ఎలున్న అసెంబ్లీలో శివసేనకు మంది బలం ఉండగా, అందులో ఇప్పుడు మంది తిరుగుబాటు మంత్రి షిండే వెంట ఉన్నారు. షిండే తరపు ఎంఎల్‌ఎలుఒక చార్టర్డ్ విమానంలో సోమవారం సూరత్ వెళ్ళి అక్కడ మకాం వేశారు. ఇప్పుడు బుధవారం తెల్లవారుజామున గువహటికి చేరారు. కాగా షిండే వెంట ఉన్న ఎంఎల్‌ఎలలో ఒకరైన నితిన్ దేశ్‌ముఖ్ బుధవారనాడు ప్రకటన చేస్తూ, తనను బలవంతంగా సూరత్ ఆసుపత్రిలో చేర్చారనీ, ఇంజెక్షన్లు ఇచ్చారని, తనకు అసలు గుండెపోటే రాలేదని చెప్పారు. నాగపూర్ విమానాశ్రయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కొంతమంది తనను సురక్షితంగా సూరత్ నుండి వెనక్కు తీసుకురాగలిగారని చెపారు. నిన్ననే మంగళవారంనాడు రౌత్ మాట్లాడుతూ దేశ్‌ముఖ్‌ను బలవంతంగా కిడ్నాప్‌చేశారని, బాగా చితకబాదారని ప్రకటించారు.
కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు
అమ్మకానికి సిద్ధంగా లేరు
కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు అమ్మకానికి సిద్ధంగా లేరని ఢిల్లీనుండి హుటాహుటిన మహారాష్ట్రకు చేరుకున్న ఎఐసిసి ప్రత్యేక పర్యవేక్షకుడు కమల్‌నాథ్ అన్నారు మహారాష్ట్ర సంక్షోభం నేపథ్యంలో పరిస్థితులు గమనించేందుకు ఆయన ప్రత్యేకదూతగా ముంబయి వచ్చారు.తమ పార్టీ ఐక్యంగా ఉందని, ఏకతాటిపై నిలబడిందని, తమ ఎంఎల్‌ఎలు అమ్మకానికి సిద్ధంగా లేరని ఆయన అన్నారు. మహా వికాస్ అఘాడీ సంకీర్ణ కూటమిలో 44 మంది ఎంఎల్‌ఎల బలం ఉన్న కాంగ్రెస్‌పార్టీ కూడా భాగస్వామిగా ఉంది. వారరి ఎంఎల్‌ఎలను జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాల్సిన బాధ్యత శివసేన పార్టీదే అని ఆయన అన్నారు. రెవెన్యూ మంత్రి బాలాసాహెబ్ థోరత్ అధికార నివాసలో కమల్‌నాథ్ సిఎల్‌పి సమావేశం నిర్వహించారు.
పదవీవ్యామోహం లేదు
RELATED ARTICLES