HomeNewsBreaking Newsపత్తికి ‘ఫంగల్‌'

పత్తికి ‘ఫంగల్‌’

ఆందోళనలో రైతులు : అతివృష్టే కారణమంటున్న వ్యవసాయ నిపుణులు
ప్రజాపక్షం/ సూర్యాపేట/ మహబూబ్‌నగర్‌ ప్రతినిధులు

పత్తి పంటకు ఫంగల్‌ వైరస్‌ సోకింది. పంట చేతికి వచ్చే సమయంలో వైరస్‌ సోకడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంట దిగుబడి గణనీయంగా పడిపోయి తమకు నష్టాలు తప్పవని వాపోతున్నారు. పంటకు వైరస్‌ సోకడానికి ప్రధాన కారణం అతివృష్టినేనని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గత కొనేళ్లుగా వరికి సమానంగా రైతులు పత్తిని సాగు చేస్తున్నారు. మార్కెట్‌లో పత్తికి డిమాండ్‌ ఉండటంతో నల్లరేగడి భూముల్లోనే సాగు చేసే పత్తిని ఎర్ర నేలల్లో కూడా పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. సూర్యాపేట జిల్లాలో ఈ ఏడాది 4 లక్షల 70వేల ఎకరాల్లో రైతులు పతిని సాగు చేశా రు. ఎకరానికి రూ. 20 నుండి 25వేల వరకు పెట్టుబడి అవుతుండగా నల్లరేగడి భూముల్లో ఎకరానికి 10 నుండి 12 క్వింటాలు, ఎర్ర నేలల్లో 6 నుండి 8 క్వింటాల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. మార్కెట్‌లో క్వింటా పత్తి ధర రూ. 5 నుండి 6వేల వరకు ధర పలుకుతుంది. పెట్టుబడి పోగా సగానికిపైగా లాభాలు రావడంతో రైతులు పత్తి సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు. గతం లాగానే ఈ ఏడాది కూడా పంట దిగుబడి బాగా వస్తుందని ఆశపడ్డారు. పత్తి పంటకు ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది పెద్ద ఎత్తున వైరస్‌లు సోకాయి. పచ్చదోమ, నల్లదోమ, దోమకాటు ఆకు ముడుత వైరస్‌లు సోకగా తాజాగా ఫంగల్‌ వైరస్‌ సోకింది. ఈ వైరస్‌తో పంట మొత్తం ఎరుపుగా మారి చెట్టుకు ఉన్న కాయలు బుడిద రంగుల మారిపోయాయి. పత్తి కొమ్మలు ఎండిపోతున్నాయి. పంట మంచిగా ఉంటే రైతులు మూడు దశల్లో పత్తిని ఎరేవారు. నేడు ఫంగల్‌ వైరస్‌తో ఆ పరిస్థితి లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. కనీసం పెట్టుబడి కూడా వెళ్ళని పరిస్థితులు నెలకొన్నాయని, తాము ఇక నిండ మునిగినట్లేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అతివృష్టినే కారణమంటున్న వ్యవసాయ నిపుణులు
పత్తి పంటలకు ఫంగల్‌ వైరస్‌ సోకడం అతివృష్టినే కారణమని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో జిల్లా వ్యాప్తంగా మోతాదు కన్నా అధికంగా వర్షం నమోదైందని, దీంతోనే పత్తి పంటకు నష్టం వాటిల్లుందని చెబుతున్నారు. పంట చేలలో వర్షం నీరు నిల్వ ఉండటంతో పాటు గాలి కూడా ఆడకపోవడంతో పంట దెబ్బతిందని, నల్లరేగడి భూముల్లో పత్తి పంటకే ఎక్కువ నష్టం జరిగిందని నిపుణుల వాపోతున్నారు.
భారీ వర్షాలతో అన్నదాత కుదేలు
భారీ వర్షాలకు పంట పొలాలు చెరువులను తలపించాయి. చేతికొచ్చిన పంటలు కళ్లముందే మునిగిపోవడంతో అన్నదాతల బాధలు వర్ణనాతీతమయ్యాయి. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో తెల్ల బంగారాన్ని ఎక్కువగా పండిస్తారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సాధారణంగా ప్రతి ఏడాది ఆరు లక్షల ఎకరాల్లో ప్రతి పంటను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఎనిమిది లక్షల ఎకరాల్లో సాగు చేశారని అధికారులు అంచనా వేశారు. ఎకరా ఒక్కంటికి 15 నుండి 18 కింటాల్లో దిగుబడి వచ్చేది. ఈ మారు వర్షాల వల్ల రెండు క్వింటాళ్లు దిగుబడి కూడా వచ్చేలా లేదని రైతులు ఆవేదన చెందుతున్నాయి. వర్షాల మూలంగా పంటలన్నీ, వర్షపు నీటిలో మునిగి, మురిగిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారం పత్తితో పాటు, విత్తనపత్తిని కూడా భారీగానే సాగు చేశారు. దానికి కూడా భారీగా నష్టం వాటిలినట్టు విత్తన పత్తి ఉత్పత్తిదారులు తెలిపారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments