న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రి యాంకా గాంధీ వాద్రా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పై దుమ్మెత్తిపోశారు. కేంద్రమాజీ మంత్రి చిన్మయానంద తనపై అత్యాచారం చేశాడని ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థికి మద్దతుగా కాం గ్రెస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన ర్యాలీని అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి అధికార దురహంకారంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని మండిపడ్డారు. విద్యార్థినికి మద్దతుగా ప్రణాళిక ప్రకారం ర్యాలీ నిర్వహింహించడానికి ముందు సోమవారం కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తుండగా దాదాపు 80 మంది పార్టీ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ప్రి యాంకా గాంధీ స్పందిస్తూ బిజెపి ప్రభుత్వం అధికార అహంతో ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని దుయ్యబట్టారు.
పజాస్వామ్యాన్ని భ్రష్టు పట్టిస్తున్న బిజెపి
RELATED ARTICLES