అందరి కళ్లూ ఆ ఇద్దరిపైనే!
టీమిండియా గెలుపు విహారి, పంత్ చేతుల్లోనే
భారత విజయ లక్ష్యం 287
పెర్త్ : పెర్త్ టెస్టు అనేక మలుపులు తిరుగుతోంది. ఆస్ట్రేలియా జట్టు పట్టు బిగించింది. ఇద్దరు కుర్ర బ్యాట్స్‌మన్లు అద్భుతంగా ఆడితే తప్ప భారతజట్టుకు పరాజయం తప్పదు. ప్రస్తుతానికి ఇంకా మూడు సెషన్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఆఖరి రోజైన మంగళవారం మిగిలివుంది. టీమిండియా విజయలక్ష్యం 175 పరుగులు. కాకపోతే టీమిండియా చేతిలో 5 వికెట్లు మాత్రమే మిగిలాయి. కుర్ర బ్యాట్స్‌మన్లు హనుమ విహారి, రిషభ్ పంత్‌లు రాణించి భారత్‌ను గెలిపించడానికి వారిద్దరికీ ఇదొక మంచి అవకాశం. కాకపోతే వారు మినహాయిస్తే మిగతావారంతా బౌలర్లే. వికెట్ పేస్‌కు, బౌన్స్‌కు తోడ్పడుతున్నది. ఆస్ట్రేలియావైపు బాణాల్లాంటి బంతులు సంధించే మిచెల్ స్టార్క్, హేజిల్‌వుడ్, కమిన్స్‌తోపాటు పిచ్‌పై పగుళ్లను తనకు అనుకూలంగా మలచుకోగల ప్రధాన స్పిన్నర్ నాథన్ లియాన్‌లు వున్నారు. వీరిని తట్టుకొని కోహ్లీసేన గెలిస్తే గొప్ప విషయమే. కనీసం డ్రా చేసినా అద్భుతమే. అయితే 175 పరుగు లక్ష్యసాధనలో రెండు వికెట్లు చేజార్చుకుంటే ఓటమి ఖాయమని క్రీడా విశ్లేషకులు చెపుతున్నారు.
రాణించిన ఖవాజా
కీలకమైన నాల్గవరోజు సోమవారం ఇరుజట్ల ఆటగాళ్లు భయంభయంగానే బరిలోకి దిగారు. ఓవర్‌నైట్ స్కోరు 132/4తో ఆస్ట్రేలియా ఆట ఆరంభించింది. అప్పటికే జట్టుకు 175 పరుగులు ఆధిక్యం ఉంది. ఈ క్రమంలో ఖవాజా (72, 213 బంతుల్లో 54), టిమ్ పెయిన్ (37, 116 బంతుల్లో 44) స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశారు. ఖవాజా అర్ధశతకం అందుకున్నాడు. శతకం వైపు పయనించాడు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 72 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. అయితే షమీ చెలరేగాడు. 6 పరుగుల వ్యవధిలో వీరిద్దరినీ, ఫించ్‌ను పెవిలియన్ పంపించాడు. ఆ తర్వాత బుమ్రా టెయిలెండర్ల పని పట్టాడు. దీంతో ఆసీస్ 243 పరుగులు చేసింది. కోహ్లీసేనకు 287 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది.
భారత్ విజయలక్ష్యం 287
అంతకుముందు, ఆస్ట్రేలియా తన రెండో ఇన్సింగ్స్‌లో 243 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 132/4తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఆసీస్ భోజన విరామం వరకు వికెట్ నష్టపోకుండా దూకుడుగా ఆడింది. అయితే భోజన విరామం తర్వాత పరిస్థితి మారింది. షమీ బౌలింగ్‌లో పైన్(37) ఔటయ్యాడు. 192 పరుగుల వద్ద షమి వేసిన బంతిని ఎదుర్కొన్న పైన్.. కోహ్లీకి చిక్కాడు. ఐదో వికెట్‌కి ఖవాజాతో కలిసి పైన్ 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకోల్పాడు. పైన్ స్థానంలో రిటైర్డ్ హర్ట్‌గా వెళ్లిన ఓపెనర్ ఆరోన్ ఫించ్(25) మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చి వెంటనే ఔటయ్యాడు. షమి బౌలింగ్‌లో తొలి బంతిని ఎదుర్కొన్న ఫించ్.. వికెట్ కీపర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 6 పరుగుల తేడాలోనే క్రీజులో ఉన్న ఖవాజా(72), ఫించ్ స్థానంలో వచ్చిన కమిన్స్(1) వెంటవెంటనే ఔటయ్యారు. అనంతరం 207 పరుగుల వద్ద లైయన్(5), 243 పరుగుల వద్ద స్టార్క్(14) వెనుదిరిగారు. దీంతో భారత్‌పై ఆస్ట్రేలియా 286 పరుగుల ఆధిక్యం సాధించింది. ముఖ్యంగా మహ్మద్ సమీ తన సత్తా చాటాడు. ఐదు వికెట్లు పడగొట్టి ఆసీస్ వెన్ను విరిచాడు. లంచ్ విరామం తర్వాత రెచ్చి పోయిన షమి వరుస విరామాల్లో మూడు వికెట్లు పడగొట్టాడు. భారత బౌలర్లలో షమి 6, బుమ్రా 3, ఇషాంత్ ఒక వికెట్ తీశారు. ఈ ఇన్నింగ్స్‌లో షమి ఒక్కడే 6 వికెట్లు తీయడం ఒక విశేషమైతే.. 51 పరుగుల్లోనే ఆసీస్ 6 వికెట్లు కోల్పోవడం మరో విశేషం.
ధోని రికార్డును బ్రేక్ చేసిన పంత్
ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారిగా అడుగుపెట్టిన టీమిండియా యువ సంచలనం రిషబ్ పంత్ వరుస రికార్డులను కొల్లగొడుతున్నాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో ఏకంగా 11 క్యాచ్‌లతో ప్రపంచ రికార్డును సమం చేసిన పంత్.. పెర్త్‌లో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత కీపింగ్ దిగ్గజం ఎంఎస్ ధోని రికార్డును బద్దలుకొట్టాడు. ఆసీస్‌తో ఒక ద్వైపాక్షిక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక ఔట్లలో పాలుపంచుకున్న భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఆతిథ్య ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో భారత పేసర్ షమీ బౌలింగ్‌లో షాన్ మార్ష్ ఇచ్చిన క్యాచ్ అందుకోవడంతో 15 ఔట్లలో పంత్ భాగస్వామ్యమయ్యాడు. దీంతో గతంలో ఒకే టెస్టు సిరీస్‌లో 14 మంది ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఔట్లలో భాగంగా నిలిచిన భారత కీపర్లు ఎంఎస్ ధోని, వ ద్ధిమాన్ సాహా, సయ్యద్ కిర్మాణీలను రికార్డును పంత్ సవరించాడు. ఆసీస్‌తో రెండో టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో మూడు క్యాచ్‌లు అందుకున్న పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో కూడా మరో మూడు క్యాచ్‌లను పట్టుకున్నాడు. దాంతో ఈ సిరీస్‌లో పంత్ పట్టిన క్యాచ్‌ల సంఖ్య 17కు చేరింది.
పంత్ నెగ్గించేనా..
RELATED ARTICLES