నేడు డిపిఒలతో హైదరాబాద్‌లో సమావేశం
సవరించిన ఓటర్ల, బిసిల జాబితాలతో రావాలని ఆదేశం
ఎన్నికల నిర్వహణపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
ప్రజాపక్షం / హైదరాబాద్ : గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై ఎంతకీ తెగడం లేదు. అసెంబ్లీ ఓటర్ల జాబితా ప్రకారం సవరించిన పంచాయతీ ఓట ర్ల జాబితా, బిసి ఓటర్ల జాబితా తయారీ ఇప్పటికీ కొలిక్కి రాలేదు. ఈ నెల 15వ తేదీలోగానే ఇవి సిద్ధం కావాల్సి ఉండగా, ఇప్పటికీ వీటి తయారీలో ఒక్క అడుగు కూడా ముందుకుపడలేదు. ఈ తరుణంలో కనీసం ఈ నెల 29లోగా వీటిని సిద్ధం చేయడం, పంచాయతీల రిజర్వేషన్లు కేటాయించడం పూర్తిచేయడం వంటివి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీరాజ్ శాఖను కోరింది. అయితే ఆలోగా కూడా ఇవి పూర్తయ్యేలా లేవు. గత కొన్ని రోజులుగా జిల్లాల కలెక్టర్లు, జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు పంచాయతీ అధికారులు ఇదే పనిలో ఉన్నప్పటికీ జాబితాలు రూపొందించలేకపోతున్నారు. అసెంబ్లీ ఓటర్ల జాబితాలో పెద్ద సంఖ్యలో ఓటర్లు గల్లంతయ్యారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘమే అంగీకరించింది. అదే జాబితాతో పంచాయతీ ఓటర్ల జాబితా రూపొందిస్తే మళ్లీ అవే తప్పులు పునరావృతం అవుతాయి. పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చాలా కీలకం. అలాంటప్పుడు జాబితాలో పేరు లేకుం పెద్ద ఎత్తున ఆందోళనలు, గొడవలు జరుగుతాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని తప్పులు లేని ఓటర్ల జాబితా, బిసిల జాబితా సిద్ధం చేయాలంటే మళ్లీ కొత్తగా ఓటర్ జాబితా తయారు చేసినంత పని అవుతోంది. దీంతో వీటి తయారీలో జాప్యం అనివార్యంగా మారింది. ఈ నేపథ్యంలో సవరించి కొత్తగా రూపొందించిన ఓటర్ల జాబితాలతో పాటు, బిసిల జాబితాలతో సమావేశానికి హాజరుకావాలని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు జిల్లా పంచాయతీ అధికారులను ఆదేశించారు. అసలే లెక్కలు కొలిక్కి రాక ఎక్కడి జాబితా అక్కడ ఉండిపోయిన తరుణంలో ఇది సాధ్యం కాదని కూడా కొందరు జిల్లా పంచాయతీ అధికారులు ఉన్నతాధికారులకు ఖరాఖండిగా చెప్పేసినట్లు తెలిసింది. దీనికి తోడు గత రెండు రోజులుగా జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియమకపు ప్రక్రియలో చోటు చేసుకున్న గందరగోళంలో డిపిఒల నుంచి ఎంపిడిఒల వరకు ఆ తప్పులను సరిదిద్దే పనిలో పడ్డారు. దీంతో ఓటర్ల జాబితా, బిసిల జాబితాను రూపొందించే పనిని పక్కన పడేశారు. ఇదంతా ఒక ఎత్తయితే మరో ప్రమాదం కూడా ఉందని పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
‘పంచాయతీ’ లెక్కలు కొలిక్కి వచ్చేనా..!
RELATED ARTICLES