సర్పంచ్ పదవికి 30, వార్డు సభ్యుడికి 20 చిహ్నాల కేటాయింపు
ప్రజాపక్షం/హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులకు వారి పేరు ఆధారంగానే గుర్తును కేటాయించనున్నారు. ఈ మేర కు వారికి గుర్తులను, కేటాయించడానికి పా టించాల్సిన మార్గదర్శకాలను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం విడుదల చేసింది. వీటిని అన్ని జిల్లాల కలెక్టర్లకు, రిటర్నింగ్ అధికారులకు, డిపిఒలు, ఎంపిడిఓలకు పంపించింది. సర్పంచ్ పదవికి 30 చిహ్నాలను కేటాయించ గా, వార్డు సభ్యునికి 20 చిహ్నాలను కేటాయించారు. సర్పంచ్ వరుసగా ఉంగరం, కత్తెర, బ్యా ట్, కప్పుసాసర్, విమానం, బంతి, షటిల్‌కాక్, కుర్చి, వంకాయ, నల్లబోర్డు, కొబ్బరికాయ, లేడీ పర్స్, మామిడికాయ, సీసా, బకెట్, బుట్ట, దువ్వెన, అరటిపండు, మంచం, పలక, టేబు ల్, బ్యాటరీలైట్, బ్రష్, క్యారెట్, గొడ్డలి, గాలి బుడగ, బిస్కట్, వేణువు, ఫోర్క్,చెంచాలను కేటాయించారు. వార్డు సభ్యునికి జగ్, గౌను, గ్యాస్‌స్టవ్, స్టూ ల్, గ్యాస్ సిలిండర్, గాజుగ్లాస్, బీరువా, కుండ, డిష్‌యాంటినా, గరాటా, మూకుడు, కెటిల్,విల్లు బాణం,నెక్‌టై, కటిం గ్‌ప్లేయర్, పోస్టు డబ్బా,విద్యుత్ స్థం బంలను కేటాయించారు. వీటితో పాటు సర్పంచ్, వార్డు సభ్యుని బ్యాలట్‌పై చివరగా నోటా గుర్తు ఉంటుంది.