పంచాయతీరాజ్ చట్టం సవరణ
ఆర్డినెన్స్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
బిసిల రిజర్వేషన్ 23.81 శాతానికే పరిమితి
10లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు
ప్రజాపక్షం/ హైదరాబాద్ : పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇందులో సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్‌లలో రిజర్వేషన్లను 50 శాతంగా పేర్కొన్నది. దీం తో గతంలో 34 శాతం ఉన్న బిసిల రిజర్వేషన్ 23.81 శాతానికే పరిమితం కానుంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం జనవరి 10వ తేదీలోగా గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పూర్తి చేయాల్సిన ఉన్నది. అయితే రిజర్వేషన్ల అంశంపై గతంలో కొంత సమస్యలు ఉన్నా యి. ఎస్సి, ఎస్టి దామాషా ప్రాతిపదికన బిసిలకు 34 శాతం రిజర్వేషన్లతో కలిసి మొత్తం గా 60 శాతానికిపైగా రిజర్వేషన్లు ఉన్నాయి. రిజర్వేషన్లు 50 శాతానికి మించి ఉండకూడదని గతంలోనే సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇలాం టి పరిస్థితుల్లో రిజర్వేషన్ల అంశంపై తర్జన భర్జన నెలకొన్నది. దీంతో రిజర్వేషన్ల అంశంపై తాజాగా హైకోర్టు జారీ చేసిన ఆదేశాలతో రాష్ట్ర ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకున్నది. గతం లో ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరణ చేస్తూ కొత్తగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఇదిలా ఉండగా పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రగతిభవన్‌లో ఆదివారం సిఎం కెసిఆర్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు రాజీవ్‌శర్మతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు,ఉన్నతాధికారులు పాల్గొన్నారు.