నౌమెయా : న్యూ కాలెడోనియా సమీపంలో బు ధవారం భారీ భూకం పం సంభవించింది. భూ కంప లేఖిణిపై దాని తీ వ్రత 7.5గా నమోదైం ది. అధికారులు సునా మీ హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ పసిఫిక్ స్వతహా వ్యాప్తంగా అత్యవసర తరలింపులు చేపట్టారు. అయితే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు నివేదికలు అందలేదు. న్యూ కాలెడోనియా ద్వీప తీరానికి ఆగ్నేయాన 170 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున భూ కంపం కేంద్రం కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. దాదాపు 20 సార్లు ప్రకంపనలు వచ్చాయన్నారు. భూకంప కేంద్రం నుంచి సునామీ అలలు ఎగిసిపడ్డాయి. దీంతో ప్రజలు భయబ్రాంతులకు గురై ఒక్కసారిగా పరుగులు పెట్టారు. మొదటగా వచ్చిన భూ ప్రకంపనలకు భవనాల గోడలు షేక్ అయినట్లు ద్వీపంలోని నివాసితులు పేర్కొన్నారు. అయితే మూడు మీటర్ల మేరక వరకు సునామీ అలలు ఎగిసిపడ్డాయని సునామీ హెచ్చరికల కేంద్రం ప్రకటించగా, ఆ తరువాత తన్న, వనౌటు ద్వీపంలో 72 సెంటీమీటర్ల మాత్రమే (2.4 ఫీట్లు) ఎగిసిపడినట్లు వెల్లడించింది. కాగా, క్రమంగా సునామీ అలలు తగ్గాయని, ఎలాంటి ప్రమాదం లేదని ఆ ప్రాంతం నుంచి నివేదికలు ధ్రువీకరించాయని పౌర రక్షణ విభాగ అధికార ప్రతినిధి తెలిపారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. భూ ప్రకంపనలు వచ్చిన దాదాపు మూడు గంటల అనంతరం సునామీ ముప్పు తప్పిపోయినట్లు హవాయ్‌కి ఆధారిత ఫసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం పేర్కొంది. అనేకసార్లు వచ్చిన ప్రకంపనలు 6.6గా నమోదైనట్లు యుఎస్ భూగర్భ సర్వే వెల్లడించింది.