అజహర్ అలీ అజేయ హాఫ్ సెంచరీ, ప్రస్తుతం పాకిస్థాన్ 139/3
అబుదాబీ: పాకిస్థాన్‌తో ప్రారంభమైన మూడో టెస్టులో న్యూజిలాండ్ 274 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. అజహర్ అలీ (62 బ్యాటింగ్) అజేయ అర్ధ శతకంతో పాక్‌ను ఆదుకున్నాడు. ఓపెనర్లు మహ్మద్ హఫీజ్ (0), ఇమామ్ ఉల్ హక్ (9) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో పాకిస్థాన్ 17 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన అజహర్ అలీ, హరీస్ సొహేల్ పాక్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మరో వికెట్ చేజారకుండా జాగ్రత్తగా ఆడుతూ పాక్ స్కోరును 50 పరుగులపై దాటించారు. వీరు మూడో వికెట్‌కు 68 పరుగుల కీలకమైన భాగస్వామ్యాన్ని ఏర్పరిచారు. అనంతరం సొహేల్ (91 బంతుల్లో 2 ఫోర్లతో 62) పరుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. దీంతో పాక్ 85 పరుగుల వద్ద మూడో వికెట్ కోల్పోయింది. తర్వాత క్రీజులోకి వచ్చిన అసద్ షఫీక్‌తో కలిసి అజహర్ అలీ పాక్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ సింగిల్స్, డబుల్స్ తీస్తూ.. స్కోరుబోర్డును ముందుకు సాగించారు. ఈక్రమంలోనే కీలక ఇన్నింగ్స్ ఆడుతున్న అలీ 130 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. తర్వాత రెండో రోజు ఆట ముగిసే వరకు అజేయంగా ఉండి (62) పరుగులు చేశాడు. అతనికి అండగా నిలిచిన అసద్ షఫీక్ (26 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. దీంతో పాకిస్థాన్ (61 ఓవర్లలో) 139/3 పరుగులు చేసింది. కివీస్ బౌలర్లలో బోల్ట్ రెండు వికెట్లు తీయగా.. సౌథీకి ఒక వికెట్ దక్కింది. అంతకుముందు 229/7 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో మంగళవారం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు 116.1 ఓవర్లలో 274 పరుగులు చేసి ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ వాట్లింగ్ ఒంటరి పోరాటం చేయడంతో కివీస్ ఈ మాత్రం స్కోరును చేయగలిగింది. అద్భుతమైన బ్యాటింగ్ చేసిన వాట్లింగ్ (250 బంతుల్లో 4 ఫోర్లతో 77 పరుగులు)తో అజేయంగా నిలిచాడు. పాక్ బౌలర్లలో బిలాల్ ఆసీఫ్ 5 వికెట్లు పడగొట్టగా.. యాసిర్ షా 3 వికెట్లు తీశాడు. హసన్ అలీ, షహీన్ అఫ్రిదీలు తలొక వికెట్ దక్కించుకున్నారు.
న్యూజిలాండ్ 274 ఆలౌట్
RELATED ARTICLES