15 మందితో కూడిన స్కాడ్‌ను ప్రకటించిన కివీస్ క్రికెట్ బోర్డు
క్రైస్ట్‌చర్చ్: ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా మే 30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచకప్‌లో పాల్గొనబోయే న్యూజిలాండ్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన జాబితాను కివీస్ బోర్డు ఐసిసికి పంపించింది. ఈ సారి ప్రపంచకప్‌లో పాల్గొనే జట్టులో అనుభవానికే పెద్దపీట వేసినట్టు కివీస్ ప్రధాన కోచ్ గ్యారీ స్టడ్ తెలిపారు. కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న సీనియర్ ఆటగాళ్లు రాస్ టేలర్, మార్టిన్ గుప్టిల్, ట్రెంట్‌బౌల్ట్, టిమ్ సౌథీలకు మరో అవకాశం కల్పించారు. ఇక రెగ్యులర్ కీపర్ లాథమ్ గతనెలలో గాయపడటంతో అతనికి బ్యాకప్‌గా బ్లన్‌డెల్ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కివీస్ జట్టు ప్రస్తుతం మంచి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో విలియమ్సన్ సేన మంచి ఫలితాలను రాబట్టుతోంది. ప్రస్తుతం ఐసిసి వన్డే ర్యాంకింగ్స్‌లో కివీస్ జట్టు మూడో స్థానంలో ఉంది. ఈసారి ప్రపంచకప్ సమరంలో న్యూజిలాండ్ కూడా టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న వరల్డ్‌కప్ పోటీల్లో పటిష్టమైన జట్టును పంపేందుకు కివీస్ క్రికెట్ బోర్డు కసరత్తులు చేసింది. వరుస సిరీసుల్లో సీనియర్లతో పాటు యువ ఆటగాళ్లను సైతం అవకాశాలు కలిపిస్తూ వారి సామర్థ్యాల్ని పరీక్షించింది. వారిలో నుంచే 15 మందిని సెలెక్ట్ చేసింది. బ్యాటింగ్‌లో విలియమ్సన్, రాస్‌టేలర్, లాథమ్, కొలిన్ మున్రోలతో కూడిన బలమైన విభాగం ఉంది. పేస్ బౌలింగ్‌లో బౌల్ట్, సౌథీ, ఫెర్గ్యూసన్‌లు.. స్పిన్నర్లలో సాంట్నర్, ఇష్ సోధీలు మంచి ఫామ్‌లో ఉన్నారు.
న్యూజిలాండ్ ప్రపంచకప్ జట్టు: కేన్ విలియమ్సన్(కెప్టెన్), టామ్ బ్లన్‌డెల్, ట్రెంట్ బౌల్ట్, గ్రాండ్ హోమ్, రాస్ టేలర్, లూకీ ఫెర్గ్యూసన్, మార్టిన్ గుప్టిల్, మ్యాట్ హెన్రీ, టామ్ లాథమ్, కోలిన్ మున్రో, జిమ్మీ నీషమ్, హెన్రీ నిఖోలస్, మిఛెల్ సాంటర్న్, ఇష్ సోధీ, టిమ్ సౌథీ.
న్యూజిలాండ్ వరల్డ్‌కప్ జట్టు ఇదే
RELATED ARTICLES