తిసారా శతకం వృథా
రెండో వన్డేలో ఓడిని శ్రీలంక
మౌంట్ మౌంగనుయ్: ఇప్పటికే టెస్టు సిరీస్ గెలుచుకున్న న్యూజిలాండ్ తాజాగా వన్డే సిరీస్‌ను కూడా కైవసం చేసుకుంది. శనివారం జరిగిన రెండో వన్డేలో కివీస్ జట్టు 21 పరుగులతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కివీస్ జట్టు 2 గెలుచుకుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు చేసింది. కివీస్ బ్యాట్స్‌మెన్స్‌లో మున్రో (87; 77 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లు), రాస్ టేలర్ (105 బంతుల్లో 90 పరుగులు)లతో రాణించారు. చివర్లో నీషమ్ 37 బంతుల్లోనే 5 ఫోర్లు, మూడు సిక్సర్లతో 64 పరుగులతో చెలరేగడంతో కివీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన శ్రీలంక జట్టులో తిసారా పెరీరా అసాధరణ బ్యాటింగ్‌తో హైలెట్‌గా నిలిచాడు. ఒకవైపు వికెట్లు పడుతున్న మరో ఎండ్‌లో నిలబడి పెరీరా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలు వరద పారిస్తూ విజయానికి చెరువ చేశాడు. కానీ చివర్లో పదో వికెట్‌గా పెరీరా ఔటవ్వడంతో లంక ఇన్నింగ్స్ 46.2 ఓవర్లలో 298 పరుగులకు ముగిసింది. కివీస్‌కు 21 పరుగుల స్వల్ప విజయం దక్కింది. మ్యాచ్‌లో తిసారా పెరీరా 74 బంతుల్లోనే 8 ఫోర్లు, 13 సిక్సర్లతో 140 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఇతర బ్యాట్స్‌మెన్స్‌లో దనుష్క గుణతిలక (71) పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు.
న్యూజిలాండ్‌దే వన్డే సిరీస్
RELATED ARTICLES