పెరిగిన పనిభారం.. ఫిట్‌మెంట్‌తో సరి
అనుబంధ విభాగాల మూసివేత
అవుట్‌సోర్సింగ్‌కే ప్రాధాన్యత
టిఆర్‌ఎస్ పాలనలోనే ఆర్‌టిసికి అధోగతి
ఏడాది క్రితమే హెచ్చరించిన “ప్రజాపక్షం”
ప్రజాపక్షం/ ఖమ్మం : ఆర్‌టిసి సమ్మె నేపథ్యంలో జరుగుతున్న ఆందోళనలతో రాష్ట్రం అట్టుడుకుతుంది. 28 రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు కారకులు ఎవరన్న దానిపై చర్చ సాగుతోంది. ఆర్‌టిసి పట్ల ప్రభుత్వ వైఖరి కారణమని చెప్పటంలో కార్మిక సంఘాలు సఫలీకృతమయ్యాయి. అందుకే ప్రజా రవాణా స్తంభించినా కార్మికుల వైపు ప్రజాసానుభూతి ఉంది. టిఆర్‌ఎస్ పాలనలో ఆర్‌టిసి పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఏడాది క్రితమే “ప్రజాపక్షం” తేటతెల్లం చేసింది. సంస్థ మనుగడ ప్రమాదంలో ఉందని హెచ్చరిస్తూ 2018 నవంబరు 10న వార్తను ప్రచురించింది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ, ఆ తర్వా త ముఖ్యమంత్రి కెసిఆర్, ఆయన అనుచరులు ఇచ్చిన హామీలను విస్మరించారు. 2014 అధికారంలోకి రాగానే ఆర్‌టిసిని నిర్వీర్యం చేయ డం ప్రారంభమైంది. ఉపాధికల్పన కల్పించాల్సిన ప్రభుత్వం ఆర్‌టిసిలో ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టె ప్రయత్నం చేస్తోంది. వరంగల్ టైర్ రీట్రెడింగ్ దుకాణాన్ని మూసివేశారు. మియాపూర్‌లోని ఆర్‌టిసి ప్రింటింగ్ ప్రెస్‌ను మూసివేశారు. ఆర్‌టిసి కళ్యాణ మంటపాన్ని ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇచ్చారు. సంస్థలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుంది తప్ప.. నియామకాలు జరగలేదు. గ్యారే జీ పనులను అవుట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. అతిథి గృహా ల నిర్వహణ కూడా అవుట్‌సోర్సింగ్‌కు ఇచ్చా రు. ఈ నేపథ్యంలో సంస్థ మనుగడపై కార్మికుల్లో ఆందోళన మొదలైంది. ఈ ఆందోళనకు తోడు ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనం కావడం సమ్మె నోటీసు ఇవ్వడానికి కారణమైంది.