ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జొకోవిచ్
ఫైనల్లో నాదల్‌పై గెలుపు
మెల్‌బోర్న్: సెర్బియా స్టార్, టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ ఏడో సారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ జొకోవిచ్ (సెర్బియా) 6 6 6 తేడాతో స్పెయిన్ బుల్ రెండో సీడ్ రాఫెల్ నాదల్‌ను వరుస సెట్లలో ఓడించి చాంపియన్‌గా అవతరించాడు. ఇది జొకోవిచ్‌కు వరుసగా మూడో గ్రాండ్‌శ్లామ్ టైటిల్ కావడం విశేషం. గత ఏడాది చివరి రెండు గ్రాండ్‌శ్లామ్‌లు (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టైటిళ్లను గెలుచుకున్న జొకోవిచ్ తాజాగా ఆస్ట్రేలియా ఓపెన్‌తో హ్యాట్రిక్ సాధించాడు. ఈ టైటిల్‌తో నూతన ఏడాదిని శుభారంభం చేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్‌లో నాలుగో రౌండ్‌లో ఓడిన జొకోవిచ్ ఈసారి టైటిల్ సొంతం చేసుకున్నాడు. మరోవైపు గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్న నాదల్ తర్వాత ఆ జోరును కనబర్చలేకపోయాడు. వింబుల్డన్, యూఎస్ ఓపెన్‌లో సెమీస్ వరకు వెళ్లిన టైటిల్ పోరుకు అర్హత సాధించలేక పోయాడు. ఈ సారి నూతన ఏడాదిన దాటిగా ఆరంభించిన నాదల్ టైటిల్ పోరులో మాత్రం తేలిపోయాడు. అత్యధిక గ్రాండ్‌శ్లామ్‌లు గెలుచుకున్న ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్న నాదల్ గత కొంత కాలంగా గాయాలతో సతమతమవుతున్నాడు. తన పాత ఫామ్‌ను అందుకోలేక పోతున్నాడు. ఇక తర్వాతి టోర్నీలోనైన నాదల్ టైటిల్ గెలుస్త్తాడని అతని అభిమానులు ఆశిస్తున్నారు. ఆదివారం ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన టైటిల్ పోరులో జొకోవిచ్ ఆరంభం నుంచి దూకుడును కనబర్చాడు. నాదల్‌పై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ తొలి సెట్‌ను 6 సునాయాసంగా గెలుచుకున్నాడు. తర్వాతి సెట్‌లోనూ అదే జోరును కనబర్చుతూ నాదల్‌పై విరుచుకుపడ్డాడు. నాదల్‌కు ఏ దశలోను పుంజుకొనే చాన్స్ ఇవ్వకుండా ఎదురుదాడికి దిగాడు. చివరి వరకు చెలరేగి ఆడిన జొకోవిచ్ ఈ సెట్‌ను కూడా 6 సొంతం చేసుకున్నాడు. ఇక తర్వాత జరిగిన మూడో సెట్‌లో ఆరంభంలో దూకుడును కనబర్చిన వరల్డ్ నెంబర్ టూ నాదల్ తర్వాత తేలిపోయాడు. ఇక జోరుమీదున్న జొకోవిచ్ మూడో సెట్‌లోనే మ్యాచ్‌ను ముగించి ఏడో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను ముద్దాడాడు. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో చివరికి టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన నాదల్‌కు నిరాశే మిగిలింది. ఈ విజయంతో జొకోవిచ్ ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
15వ గ్రాండ్ శ్లామ్..
ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంకర్ నాదల్‌ను ఓడించిన జొకోవిచ్ తన ఖాతాలో 15వ గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను వేసుకున్నాడు. మాజీ స్టార్ పీట్ సంప్రాస్ (14) టైటిళ్లను అధిగమించాడు. అంతే కాకుండా పురుషుల సింగిల్స్ విభాగంలో అత్యధిక గ్రాండ్‌శ్లామ్‌లు గెలుచుకున్న వారి జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. అందరి కంటే ఎక్కువగా స్విస్ స్టార్ రోజర్ ఫెదరర్ (20) గ్రాండ్‌శ్లామ్‌లు గెలుచుకొని ఈ జాబితాలో మొదటి స్ఠానంలో ఉన్నాడు. తర్వాత స్పెయిన్ స్టార్ రాఫెల్ నాదల్ (17) గ్రాండ్‌శ్లామ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. తాజా టైటిల్‌తో జొకోవిచ్ మొత్తం (15) గ్రాండ్‌శ్లామ్‌లతో మూడో స్థానం దక్కించుకున్నాడు.
ఫెదరర్‌ను అధిగమించాడు..
తాజా టైటిల్‌తో సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ తన ఖాతాలో ఏడో ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టైటిల్ వేసుకున్నాడు. ఫైనల్లో మాజీ చాంపియన్ నాదల్‌ను చిత్తు చేసిన జొకోవిచ్ అస్ట్రేలియా ఓపెన్‌ను అత్యధిక సార్లు (7) గెలుచుకున్న తొలి ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. అంతకుముందు స్విట్జర్లాండ్ స్టార్ రోజర్ ఫెదరర్ (6 సార్లు), ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రాయ్ ఎమర్సస్ (6 సార్లు) పేరుతో ఉన్న రికార్డును తాజాగా జొకోవిచ్ బద్దలు కొట్టాడు. వీరిద్దరిని అధిగమించి మొదటి స్థానంలో కైవసం చేసుకున్నాడు. ఈ సెర్బియా స్టార్ వరసగా (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019) సంవత్సరాలలో ఆస్ట్రేలియా ఓపెన్ టైటిళ్లను కైవసం చేసుకున్నాడు.
నొవాక్ ఏడోసారి..
RELATED ARTICLES