మాజీ క్రికెటర్‌తో నేడు ఒప్పందం కుదుర్చుకోనున్న ఇసి
న్యూఢిల్లీ : ప్రముఖ మాజీ క్రికెట్ క్రీడా కారుడు సచిన్ టెండూల్కర్‌ను భారత ఎన్నికల సంఘం (ఇసి) ‘నేషనల్ ఐకాన్’గా నియమించింది. ఎన్నికల ప్రక్రియలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనేలా.. అవగాహన కల్పించేందుకు ఇసి ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా సచిన్ అవగాహన కల్పించనున్నారు. దీనికి సంబంధించి జాతీయ ఎన్నికల కమిషన్, సచిన్ టెండూల్కర్‌కు మధ్య బుధవారం అవగాహన ఒప్పందం కుదరనుంది. ఈ అగ్రిమెంట్‌లో భాగంగా.. మూడేళ్ల పాటు ఓటర్లలో అవగాహన కల్పించనున్నారు ఈ క్రికెట్ లెజెండ్ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం, టెందుల్కర్ సంయుక్తంగా కృషి చేస్తారు. ముఖ్యంగా పట్టణ ప్రాంత ప్రజలు, యువత ఓటింగ్‌పై నిర్లక్ష్యం వహిస్తున్న వేళ.. వారిలో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటారు. సచిన్ పేరుప్రఖ్యాతల కారణంగా యువతపై ఆయన ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఇసి విశ్వాసంతో ఉంది. దీంతో రాబోయే అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల పక్రియలో యువత ఎక్కువగా పాల్గొనేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రసిద్ధి చెందిన వ్యక్తులను వనేషనల్ ఐకాన్’గా నియమిస్తుంది ఎన్నికల కమిషన్. ప్రజలు ఓటింగ్ పక్రియలో పాల్గొనేలా వీరి ద్వారా అవగాహన కల్పిస్తుంది. 2022లో పంకజ్ త్రిపాఠీని నేషనల్ ఐకాన్‌గా నియమించింది ఎన్నికల సంఘం. 2019 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎమ్‌ఎస్ ధోనీ, ఆమిర్ ఖాన్, మేరీ కోమ్ ’నేషనల్ ఐకాన్’గా వ్యవహరించారు.
‘నేషనల్ ఐకాన్’గా సచిన్ టెండూల్కర్
RELATED ARTICLES