సరిహద్దు ఘర్షణలో ప్రాణం కోల్పోయిన సూర్యాపేట వాసి బిక్కుమళ్ల సంతోష్‌బాబు
విషాద వదనంలో జిల్లా ప్రజలు
ప్రజాపక్షం/ సూర్యాపేట బ్యూరో / హైదరాబాద్: చైనా సైనికులతో సోమవారం జరిగిన ఘర్షణలో సూర్యాపేట (భానుపురి) వీరుడు మరొకరు నేలకొరిగారు. 1999లో జరిగిన కార్గిల్ పోరులో సూర్యాపేట నియోజకవర్గంలోని పెన్‌పహాడ్ మండలం చీదేళ్ళ గ్రామానికి చెందిన లాన్స్‌నాయక్ గోపయ్యచారి ప్రాణాలను కోల్పోగా.. ఇప్పుడు భానుపురి పట్టణాకి చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్‌బాబు(37) చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో అమరుడయ్యారు. దీంతో సూర్యాపేట పట్టణంలో విషాద వదనం అలుముకుంది. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన రిటైర్డ్ ఎస్‌బిఐ బ్యాంక్ మేనేజర్ బిక్కుమళ్ళ ఉపేందర్ మంజుల దంపతులుకు కుమారుడు సంతోష్‌బాబు, కుమారై ఉన్నారు. ఒకటవ తరగతి నుండి ఐదు వరకు సూర్యాపేట పట్టణంలోనే విద్యను అభ్యసించిన సంతోష్‌బాబు.. చిన్ననాటి నుండే చదువులో చురుకుగా ఉండడంతో 6వ తరగతిలో కోరుకొండ సైనిక్ పాఠశాలలో చేర్పించారు. అనంతరం నేషనల్ డిఫె న్స్ అకాడమీలో, ఇండియన్ మిలటరీ అకాడమీ లో చేరారు. 2004 ఉద్యోగంలో చేరి గత 15 సం వత్సరాలుగా భారత్ సైన్యంలో సేవలు అందిస్తున్నారు. కశ్మీర్, అరుణాచల్ ప్రదేశ్, లఢక్, పాకిస్తా న్ సరిహద్దులో పని చేశారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ లో పని చేస్తుండగా నెల రోజుల క్రితం భారత్, చై నాకు మధ్య జరుగుతున్న గొడవల్లో లఢక్, గల్వన్ లోయ సమీపంలో సోమవారం రాత్రి ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల్లో సంతోష్‌బాబు మృతి చెం దారు. ఈ మేరకు ఆర్మీ ఆయన కటుంబసభ్యులకు సమాచారం అందించింది. సంతోష్‌బాబుకు భార్య, ఒక కుమారుడు, కుమారై ఉన్నారు. విషాద వదనంలో సూర్యాపేట సంతోష్‌బాబు మృతితో సూర్యాపేట పట్టణంలో విషాద వదనం అలుముకుంది. సంతోష్‌బాబు ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన వారు. అయితే సమాచారం తెలుసుకున్న సంతోష్‌బాబు బంధువర్గం విద్యానగర్‌లోని వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. వీర మ రణం పొందిన సంతోష్‌బాబుకు జోహార్లు తెలిపా రు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న ఆయన తల్లిదండ్రులను ఓదార్చారు. దేశం కోసం తన కొడుకు ప్రాణాలు అర్పించడం ఎంతో గర్వంగా ఉందని చెబుతున్న వారు లోలోనా మాత్రం పేగుబంధాన్ని గుర్తు చేసుకొని తల్లడిపోతున్నారు.
సిఎం కెసిఆర్ దిగ్భ్రాంతి : సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్య క్తం చేశారు. దేశం కోసం తెలంగాణ బిడ్డ ప్రాణ త్యాగం చేశారని, ఆ త్యాగం వెలకట్టలేనిదని సిఎం అన్నారు. సంతోష్ తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఇతర కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన కుటుంబానికి ప్ర భుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని సిఎం ప్రకటించారు. సంతోష్ మృతదేహాన్ని రిసీవ్ చేసుకోవడంతో పాటు, అంత్యక్రియల వరకు ప్రతీ కా ర్యక్రమంలోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా పాల్గొనాలని మంత్రి జగదీశ్‌రెడ్డిని ముఖ్యమంత్రి ఆదేశించారు.
సంతోష్‌బాబుకు చాడ సెల్యూట్ : సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో వీర మరణం పొందిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన సూర్యాపేట వాసి కల్నల్ సంతోష్ బాబుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి జోహార్లు అర్పించారు. చిన్నతనం నుండే క్రమశిక్షణతో పెరిగి, దేశం కోసం, భారత జాతి కోసం అసువులు బాసిన వీరులను చూసి గర్విస్తున్నామని ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే సరిహద్దులో వీర మరణం పొందిన భారత సైనికులకు కూడా సిపిఐ రాష్ట్ర సమితి తరుపున ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేశారు.
నేల కొరిగిన భానుపురి వీరుడు
RELATED ARTICLES