ఇండోర్: ఆలయాల సందర్శనపై బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యలపై ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఈ దేశంలోని దేవాలయాలు ఏమైనా బిజెపి, ఆర్ సొత్త అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రమే ఆలయాల సందర్శన కోసం ఏమైనా కాంట్రాక్టు తీసుకున్నారా..? అని మండిపడ్డారు. దేవాలయాల సందర్శనపై తనకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదని కాషాయ పార్టీ కన్న హిందు మతాన్ని బాగా అర్థం చేసుకుంది నేనంటూ బదులిచ్చారు. జాతీయ వాదిగా ప్రతి మతాన్ని, కులాన్ని, వర్గాన్ని, భాషను గౌరవిస్తానని తెలిపారు. మంగళవారం ఇండోర్ విలేకర్లతో మాట్లాడిన యువనేత ఎన్నికల వేళ రాహుల్ ప్రత్యేకమైన హిందు వస్త్ర ధారణతో ఆలయాలకు వెళ్లడం విడ్డూరంగా ఉందని బిజెపి నాయకులు విమర్శలు చేస్తుండడం సరికాదన్నారు. మోదీ, అమిత్ షా దేవాలయాలకు వెళ్లినప్పుడు ఆలయాల సంప్రదాయం ప్రకారం ప్రత్యేక దుస్తువులు ధరించడం లేదా..? అని ప్రశ్నించారు. అలాగే మా పార్టీ నాయకుడు కమల్ నాథ్, జ్యోథిరాధిత్య సింధియా, నేను సోమవారం హిందు సంప్రదాయంలో ఆలయాలను సందర్శించం తప్ప… ఇందులో వేరే విశేషం ఏమీ లేదన్నారు. మేము ఉజ్జయిని మహకాలేశ్వర్ ఆలయాన్ని దర్శించుకోవడంపై బిజెపి అధికార ప్రతినిధి సమ్బిత్ పాత్ర రాహుల్ గోత్రమేటని వింతగా ప్రశ్నించడం సరికాదన్నారు. ఈ విషయంలో ఎవరు తనకు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదని బిజెపి నేతల కన్న తనకు హిందూ మతం బాగా తెలుసన్నారు. హిందు, హిందూత్వ అనేవి రెండు భిన్నమైన కోణాలని… హిందు అనేది ఒక మంచి దృక్పథం.. కానీ, హిందుత్వ అనేదే బిజెపి అతివాద ఆలోచనలో నుంచి పుట్టింది మాత్రమేనని పేర్కోన్నారు. బిజెపి వచ్చే ఎన్నికల్లో లాభ పడేందుకే రామ మందిర అంశాన్ని తెరపైకి తెస్తుంది తప్ప… ఆ పార్టీకి అభివృద్ధి అనే ఆలోచన లేదన్నారు. అలా ఉంటే మోడీ ప్రభుత్వం అవినీతిని అరికట్టడం, యువతకు ఉద్యోగ కల్పన, రైతులు పండించి పంటలకు మంచి ధర కల్పించడంలో ఎందుకు విఫలం చెందిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.
నేను జాతీయ వాదిని : రాహుల్
RELATED ARTICLES