ఆక్లాండ్: తాను ఔటవ్వకుండా క్రీజులో కడవరకు నిలిస్తే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేదని టీమిండియా యువ పేసర్ నవ్‌దీప్ సైనీ తెలిపాడు. న్యూజిలాండ్‌తో శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 22 పరుగులతో ఓడి సిరీస్‌ను ఒక మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్‌లో టాపార్డర్, మిడిలార్డర్ విఫలమైన వేళ రవీంద్ర జడేజా, నవ్ దీప్ సైనీ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్ప్‌ై ఆశలు రేకిత్తించారు. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును గెలుపు దిశగా నడిపించారు. ముఖ్యంగా పేసర్ సైనీ బ్యాటింగ్ ఆకట్టుకుంది. గ్రాండ్‌హోమ్ ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన అనంతరం జేమీసన్ బౌలింగ్‌లో ఎక్స్‌ట్రా కవర్ మీదుగా అతను కొట్టిన సిక్సర్ హైలైట్‌గా నిలిచింది. 34 బంతుల్లో మరో 45 పరుగులు చేయాల్సిన స్థితిలో సైనీ బౌల్ కావడం.. ఆ తర్వాత జడేజా భారీ షాట్‌కు ప్రయత్నించి ఔటవ్వడంతో భారత్ ఓడింది. సైనీ-జడేజా ఎనిమిదో వికెట్‌కు ఏకంగా 80 బంతుల్లో 76 పరుగులు జత చేయడం విశేషం. అయితే మ్యాచ్ అనంతరం సైనీ మాట్లాడుతూ.. తాను కడవరకూ క్రీజ్‌లో ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదన్నాడు. ‘నేను ఔటవ్వకుంటే ఫలితం కచ్చితంగా మరోలా ఉండేది. జడేజాతో పాటు నేను కూడా కడవరకూ ఉంటే మ్యాచ్‌ను గెలుపుతో ముగించే వాళ్లం. వికెట్ చాలా ఫ్లాట్‌గా ఉండటంతో బంతి నేరుగా బ్యాట్‌పైకి వచ్చింది. టాపార్డర్ స్వింగ్‌కు పెవిలియన్ చేరితే, మిడిల్ ఆర్డర్ అనవసరమైన షాట్లతో వికెట్లను సమర్పించుకుంది. 113 బంతుల్లో 121 పరుగులు కొట్టాల్సిన సందర్భంలో చేతిలో మూడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో 76 పరుగులు చేశాం. ’అని సైనీ తెలిపాడు. త్రోడౌన్ స్పెషలిస్ట్ రఘు వల్లే తాను బ్యాటింగ్‌లో రాణించగలగానని సైనీ చెప్పుకొచ్చాడు. ‘సైనీ బ్యాట్‌తో మెరుస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. నేను బ్యాటింగ్ కూడా చేస్తానని ఎవరూ అనుకొని ఉండరు. అయితే టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్టు రఘు నాలోని బ్యాటింగ్ స్కిల్స్‌ను గుర్తించాడు. నువ్వు బ్యాటింగ్ కూడా చేయగలవని పదే పదే అంటుండేవారు. రఘు మాటలు నాలో స్ఫూర్తిని నింపాయి. హోటల్ రూమ్‌లో కూడా నా బ్యాటింగ్ కోసం మాట్లాడేవారు. అదే నన్ను బ్యాటింగ్ చేయడానికి దోహం చేసింది.’ఈ యువ పేసర్ తెలిపాడు.
పశ్చాతాపపడ్డాను..
తన ఔటైన తీరును వీడియోలో చూసుకొని పశ్చాతాపానికి గురైనట్లు సైనీ పేర్కొన్నాడు. ‘నేను బ్యాటింగ్‌కు వెళ్లే సమయానికి చాలా పరుగులు చేయాలి. మ్యాచ్‌ను కడవరకూ తీసుకెళ్లాలని జడేజా నాతో చెప్పాడు. అప్పుడే గెలిచే అవకాశం ఉంటుందని అనుకున్నాం. ఒకవేళ బౌండరీ కొట్టాల్సిన బంతి అయితే హిట్ చేయమని జడేజా సూచించాడు. ప్రధానంగా సింగిల్స్-డబుల్స్‌పై దృష్టి పెట్టి స్టైక్ రొటేట్ చేశాం. నేను ఫోర్ కొట్టిన తర్వాత కాస్త ఆశ్చర్యానికి లోనయ్యా. బ్యాట్‌పైకి బంతి బాగా రావడంతో సులువుగా షాట్లు ఆడా. కాకపోతే నేను ఔట్ అవ్వడమే చాలా బాధించింది. మ్యాచ్ అయిన తర్వాత వీడియో చూసి చాలా ఫీలయ్యా. నేను ఔట్ కాకపోయి ఉంటే మ్యాచ్ ఫలితం వేరేలా ఉండేది. కీలక సమయంలో ఔట్ కావడం నిరుత్సాహానికి గురి చేసింది’ అని సైనీ చెప్పుకొచ్చాడు.
నేను ఔట్ అవకుంటే ఫలితం మనదే : షైనీ
RELATED ARTICLES