రెండుమూడు నెలల్లో అమలు
నా ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరు
సిఎం కె. చంద్రశేఖర్‌రావు
ప్రజాపక్షం/రాజన్న సిరిసిల్ల చేనేత కార్మికులకు బీమా సౌకర్యాన్ని వర్తింప చేయనున్నట్టు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. రెండుమూడు నెలల్లోనే ఇది అమల్లోకి వస్తుందని హామీ ఇచ్చారు. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా ఏవిధంగానైతే రూ.5 లక్షలు బీమా అందజేస్తున్నామో అదేవిధంగా చేనే త కార్మికుడు చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందేలా చర్యలు చేపడుతున్నామని సిరిసిల్ల పర్యటనలో భాగంగా కలెక్టరేట్ భవనం లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ చెప్పా రు. తన ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని ఆయన పరోక్షంగా ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. ఆశలు ఆవిరైన సమయంలోనే ఉద్యమ జ్వాలను ప్రజ్వలింపజేసి, ఇకరాదనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని దృఢ సంకల్పంతో, పట్టుబట్టి సాధించుకున్నామని గుర్తుచేశారు. బంగారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మనకంటూ ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకున్నామని, ఆ దిశగా ప్రయాణిస్తున్నామని పేర్కొన్నారు. వాటి ఫలితాలు మన ముం దేకాదు యావత్ ప్రపంచం ముందు కూడా ఉన్నాయని కెసిఆర్ అన్నారు. లక్ష్యశుద్ధి.. చిత్తశుద్ధి.. వాక్శుద్ధి.. ఈ మూడు తోడైతే ఏపనైనా వందశాతం అవుంతుందని సిఎం అన్నారు. ఇందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో సిఎం ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. మొదటగా మండెపల్లి లోని రెండు పడక గదుల గృహ సముదాయాన్ని, అనంతరం అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్ ను, తదనంతరం సిరిసిల్ల పట్టణంలోని నర్సింగ్ కళాశాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఆ వెంటనే సర్ధాపూర్ లోని వ్యవసాయ మార్కెట్ యార్డు, చివరిగా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ భవనంలో ఆయన మాట్లాడుతూ పరిపాలన సంస్కరణల్లో భాగంగా నూతన జిల్లాల ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపిన సిఎం, ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జ్లిలా ఏర్పాటైందని అన్నారు. జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించిన ముఖ్య కార్యాలయం కలెక్టరేట్ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో వాదప్రతివాదాలు జరిగినట్లు తెలిపిన సిఎం ‘మీకు ఏది చేతకాదు’ అనే వాదనను ఖండించినట్లు చెప్పారు. ఇందుకు నిదర్శనంగా అభివృద్ధి మన కళ్ల ముందు కనిపిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో కడుతున్న అద్భుత సమీకృత కలెక్టరేట్ నిర్మాణాలకు డిజైన్‌ను మన తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి సిద్ధం చేశారని అన్నారు. ఈ నిర్మాణాలను తెలంగాణ ఇంజినీరు గణపతిరెడ్డి కడుతున్నారని అన్నారు. వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వృద్ధాప్య పింఛన్లపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత కేబినెట్ మీటింగ్‌లో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని సిఎం వెల్లడించారు. చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా వాళ్లకొక ఆధారంగా ఉంటుందన్నారు. చేనేత విషయంలో, మరమగ్గాల విషయంలో కూడా కొంత డబ్బును కార్పస్ ఫండ్‌గా పెట్టి ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపడుతుందన్నారు. అన్ని వృత్తుల మాదిరే చేనేత కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన చర్యలను సిఎం వివరించారు. నూలు గానీ, రసాయనాలు గానీ, రంగులు గానీ 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నట్లు చెప్పారు. అందరి మొఖాల మీద చిరునవ్వులు వికసించే తెలంగాణ కావాలని ఆ దిశగా ముందుకు పురోగమిద్దామని అన్నారు. ఈ సమావేశానికి మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అధ్యక్షత వహించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సిఎస్ సోమేశ్‌కుమార్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
జిల్లాల ఏర్పాటు చేసుకున్నట్లు తెలిపిన సిఎం, ఈ క్రమంలోనే రాజన్న సిరిసిల్ల జ్లిలా ఏర్పాటైందని అన్నారు. జిల్లా పాలన వ్యవహారాలకు సంబంధించిన ముఖ్య కార్యాలయం కలెక్టరేట్ ఏర్పాటు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం ఏర్పడకముందు ఎన్నో వాదప్రతివాదాలు జరిగినట్లు తెలిపిన సిఎం ‘మీకు ఏది చేతకాదు’ అనే వాదనను ఖండించినట్లు చెప్పారు. ఇందుకు నిదర్శనంగా అభివృద్ధి మన కళ్ల ముందు కనిపిస్తున్నదని అన్నారు. రాష్ట్రంలో కడుతున్న అద్భుత సమీకృత కలెక్టరేట్ నిర్మాణాలకు డిజైన్‌ను మన తెలంగాణ బిడ్డ, ఆర్కిటెక్ట్ ఉషారెడ్డి సిద్ధం చేశారని అన్నారు. ఈ నిర్మాణాలను తెలంగాణ ఇంజినీరు గణపతిరెడ్డి కడుతున్నారని అన్నారు. వచ్చే నెలలో 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయనున్నట్లు కెసిఆర్ ప్రకటించారు. గతంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా వృద్ధాప్య పింఛన్లపై చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. పల్లె ప్రగతి కార్యక్రమం తర్వాత కేబినెట్ మీటింగ్‌లో చర్చించి ఈ అంశంపై నిర్ణయం తీసుకుంటామని సిఎం వెల్లడించారు. చేనేత కార్మికుడు చనిపోతే ఆ కుటుంబం బజారున పడకుండా వాళ్లకొక ఆధారంగా ఉంటుందన్నారు. చేనేత విషయంలో, మరమగ్గాల విషయంలో కూడా కొంత డబ్బును కార్పస్ ఫండ్‌గా పెట్టి ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపడుతుందన్నారు. అన్ని వృత్తుల మాదిరే చేనేత కార్మికులను కూడా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిన చర్యలను సిఎం వివరించారు. నూలు గానీ, రసాయనాలు గానీ, రంగులు గానీ 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నట్లు చెప్పారు. అందరి మొఖాల మీద చిరునవ్వులు వికసించే తెలంగాణ కావాలని ఆ దిశగా ముందుకు పురోగమిద్దామని అన్నారు. ఈ సమావేశానికి మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావు అధ్యక్షత వహించారు. వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, రోడ్లు, భవనాలశాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తోపాటు పలువురు ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సిఎస్ సోమేశ్‌కుమార్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
నేత కార్మికులకు బీమా
RELATED ARTICLES