లక్నో: బులంద్‌షహర్ అల్లర్లలో మృతి చెందిన పోలీసు అధికారి సుబోధ్ కుమార్ సింగ్ కుటుంబాన్ని ఈరోజు(గురువారం) ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పరామర్శించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం యూపి సిఎంవో ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా సిఎంవో అధికారులు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గురువారం తానుండే కాలిదాస్ మార్గ్ నివాసంలో బాధిత పోలీసు అధికారి సుబోధ్ కుటుంబీకులను కలుసుకొని ఓదార్చుతారని తెలిపారు. సుబోధ్ భార్యకు రూ.40 లక్షలు, తల్లిదండ్రులకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేసియాతో పాటు కుటుంబీకుల్లో ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇస్తామని ఇప్పటికే సిఎం యోగి ప్రకటించారు. బులంద్‌షహర్‌లో గోవులను అన్యాయంగా వధించారని హిందూ సంఘాలు, భజరంగ్‌దళ్ నాయకులు సృష్టించిన విధ్వంసంలో పోలీసు అధికారి సుబోధ్ సింగ్ మృతి చెందిన విషయం తెలిసింది. అల్లర్ల అదుపు తప్పడంతో పోలీసులు కాల్పులు కూడా జరిపారు. ఈ ఘటనలో సుమిత్ సింగ్(20) అనే యువకుడు ప్రాణాలు కూడా కోల్పోయాడు. ప్రస్తుతం ఈ కేసును సిట్ విచారిస్తోంది. ఇక బులంద్‌షహర్ ఘటనపై మాట్లాడిన యూపి డిజిపి ఓపి సింగ్ ఆందోళకారుల అల్లర్ల వెనక్కు కుట్ర దాగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
నేడు సుబోధ్ కుటుంబాన్ని పరామర్శించనున్న సిఎం యోగి
RELATED ARTICLES