ప్రజాపక్షం/యాదాద్రి ప్రతినిధి యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగు నీటి ప్రాజెక్టును సిపిఐ రాష్ట్ర బృందం సోమవారం పరిశీలించనుంది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్ల వెంకట్‌రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యురాలు పశ్య పద్మ, కార్యవర్గ సభ్యులు కె. శ్రీనివాస్రెఢ్డి తదితర బృందం సభ్యులు ఆత్మకూర్ మండల కేంద్రంలో ఆసంపూర్తిగా నిలిచిపోయిన బునాది గాని కాలువ పనులను పరిశీలించనున్నారు. ఆ తరువాత భువనగిరి మండలం బస్వాపురంలో నృసింహసాగర్ రిజర్వాయర్‌ను సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు వివరాలను తెలుసుకొనున్నారు. నిర్వాసితులను కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. గడువు ముగిసినా ప్రాజెక్టు పనులు పూర్తి కాకపోవడానికి గల కారణాలను విశ్లేసిస్తారు. అటు తరువాత తుర్కపల్లి మండలం గందమల్ల చెరువును సందర్శిస్తారు. ఈ చెరువును రిజర్వాయర్‌గా మార్చి ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించి టెండర్లు సైతం పిలిచింది. ఆ తరువాత అర్ధాంతరంగా భూసేకరణ నిలిపివేసింది. టెండర్లను రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవడంతో పాటు గందమల్ల రిజర్వాయర్ ఉందా? లేదా? స్పష్టత లేకపోవడంతో గందమల్ల ప్రజలు అభివృద్ధి ఫలాలకు దూరమవుతున్నారు. ఆ గ్రామ ప్రజలను కలిసి వారి అభిప్రాయాలను సైతం తెలుసుకోనున్నారు. సిపిఐ రాష్ట్ర బృందం రాక సందర్భంగా యాదాద్రిభువనగిరి జిల్లా సిపిఐ కార్యదర్శి గోద శ్రీరాములు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
నేడు సిపిఐ బృందం సాగునీటి ప్రాజెక్టుల సందర్శన
RELATED ARTICLES