ప్రజాపక్షం / హైదరాబాద్ ; తెలంగాణలో బుధ, గురువారాల్లో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సము ద్రం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర కొంకన్ ప్రాంతాలలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ కోస్తా, ఆంధ్రా, దక్షిణ మధ్య మహారాష్ట్ర, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తువరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, ఆంధ్ర దాని పరిసర ప్రాంతాలలో 2.1 కిలోమీటర్ నుంచి 5.8 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. పశ్చిమబెంగాల్ కోస్తా తీర ప్రాంతాల లో ఈనెల 26న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఫలితంగా తెలంగాణలో బుధవారం కొన్ని ప్రాంతాలలో, గురువారం చాలా ప్రాంతాలలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గురువారం ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. కోస్తా, ఆంధ్రలోనూ, రాయలసీమలోనూ నేడు,రేపు వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
నేడు, రేపు వర్షాలు
RELATED ARTICLES