ఇండిపెండెంట్లపై ‘గులాబీ’ గురి
బలం లేని చోట ‘ఎక్స్ అఫీషియో ఓటు’
ప్రజాపక్షం/హైదరాబాద్; మున్సిపాలిటీలు, కార్పోరేషన్లను కైవసం చేసుకునేలా టిఆర్‌ఎస్ పక్కా వ్యూహాన్ని రచించింది. రాష్ట్రవ్యాప్తంగా 120 ము న్సిపాలిటీలు, 9 కార్పోరేషన్లకు మేయర్, చైర్‌పర్సన్, డిప్యూటీ మేయర్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక ఆదివారం జరగనుంది. దీనికి సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసింది. మరోవైపు మేయర్, చైర్‌పర్సన్ పదవులను కైవసం చేసుకునేందుకు టిఆర్‌ఎస్ కసరత్తును పూర్తి చేసింది. టిఆర్‌ఎస్‌కు పూర్తి బలం లేని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటును వినియోగించుకునేలా పకడ్బందీగా కార్యాచరణ రూపొందించుకుంది. ఇందులో భాగంగా మున్సిపాలిటీలు, కార్పోరేషన్ పరిధిలో గెలిచిన ఇండిపెండెంట్ అభ్యర్థులతో జిల్లా నాయకత్వం వచ్చినప్పటికీ ఇందులో రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు టిఆర్‌ఎస్ అన్ని శక్తులు ఒడ్డుతోంది. ఎక్స్ అఫిషియో సభ్యుల ఓటు ద్వారా కొంత బయటపడే అవకాశాలు ఉన్నాయని టిఆర్‌ఎస్ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు 9 కార్పోరేషన్లను కూడా టిఆర్‌ఎస్ గెలుచుకునే దిశగా పాచికలు వేసింది. ఇందులో ప్రధానంగా నిజామాబాద్‌లో ఎంఐఎం మద్దతుతో పాలకమండలిని కైవసం చేసుకోనుంది. మేయర్, డిప్యూటీ మేయర్‌ను రెండు పార్టీలు పంచుకోనున్నాయి. అలాగే మరో నాలుగు కార్పోరేషన్‌లో కూడా ఏ పార్టీకి మెజార్టీ లేకపోయినప్పటికీ ఎక్స్‌అఫిషియో, ఇండిపెండెంట్ సభ్యులతో కలిసి కార్పోరేషన్‌లో మేయర్ స్థానాలను కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కసరత్తు పూర్తి చేశారు. అయితే కేవలం ఎక్స్ అఫిషియో సభ్యులతో బయటపడే అవకాశాలు ఉన్న మున్సిపాలిటీల్లో అక్కడ గెలిచిన రెబెల్స్‌ను తిరిగి పార్టీలో తీసుకోరాదని టిఆర్‌ఎస్ భావిస్తున్నట్టు సమాచారం.
నేడు మేయర్, చైర్‌పర్సన్ల ఎన్నిక
RELATED ARTICLES