రెండు రోజుల పాటు దేశ రాజధానిలో ఉండనున్న కెసిఆర్
మోడీ సహా పలువురు కేంద్ర మంత్రులతో భేటీ?
టిఆర్‌ఎస్ కార్యాలయానికి భూమి పూజ చేయనున్న పార్టీ అధినేత
ప్రజాపక్షం / హైదరాబాద్‌రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రెండు రోజుల పా టు అక్కడే మకాం వేయనున్నట్లు సమాచారం. మన దేశంలోకి కరోనా ప్రవేశించిన తర్వాత ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తుండడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పర్యటనలో భాగం గా ప్రధాని మోడీ సహా పలువురు కేంద్ర మం త్రులను కెసిఆర్ కలిసే అవకాశమున్నట్లు తెలసింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిల గురించి కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు. కాగా, జిహెచ్‌ఎంసి ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి వచ్చిన బిజెపి నేతలంతా కెసిఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో మళ్లీ వారితోనే కెసిఆర్ భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఢిల్లీలో శనివారం టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి సిఎం కెసిఆర్ భూమిపూజ చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
నేడు ఢిల్లీకి సిఎం
RELATED ARTICLES