68.10 లక్షల మంది అర్హుల జాబితా సిద్ధం
జులై 15 వరకు పత్తి విత్తుకునే అవకాశం : మంత్రి నిరంజన్ రెడ్డి
ప్రజాపక్షం/హైదరాబాద్ వానాకాలం రైతుబంధు పంపిణీ మంగళవారం నుంచి ప్రారంభంకానుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సిసిఎల్‌ఎ వ్యవసాయశాఖకు అందజేసింది. దీంతో వ్యవసాయ శాఖ ఎకరాల వారీగా బిల్లులను రూపొందించి ఆర్థిక శాఖకు అప్పగించింది. ప్రతి రోజూ ఒక ఎకరా నుండి ఆరో హణ క్రమంలో రైతు ఖాతాలలో రైతుబంధు జమకానుంది. రైతుబంధులో భాగంగా రాష్ట్ర వ్యాపితంగా 68.10 లక్షల మంది అర్హుల జాబితాను సిద్ధం చేశారు. ఒక కోటీ 50లక్షల 43వేల 606 ఎకరాలకు రైతు బంధు సాయం అందనుంది. రైతుబంధుకు సంబంధించి రూ. 7521.80 కోట్లు సిద్ధంగా ఉన్నాయని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మొదటిసారి రైతుబంధు తీసుకునే రైతులు వెంటనే క్షేత్రస్థాయిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి తమ పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతాకు చెందిన వివరాలు అందజేసి, తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆర్థిక పరమైన అడ్డుంకులను సృష్టించినప్పటికీ రైతుల మీద అభిమానంతో సిఎం కెసిఆర్ రైతుబంధు నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందుకు రైతుల పక్షాన సిఎం కెసిఆర్‌కు మంత్రి నిరంజన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పత్తి, కంది,ఇతర అపరాలు, నూనెగింజల పంటల సాగుపైన రైతులు దృష్టి సారించాలన్నారు. జులై 15వ తేదీ వరకు పత్తి విత్తుకునే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి నిరంజన్ రెడ్డి భరోసనిచ్చారు. వర్షాలు కొంత ఆలస్యమైనందున తేలిక నేలలో 5 నుండి 6.5 సెంటీమీటర్లు, బరువు నేలలలో 6 నుండి 7.5 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైన తర్వాతనే రైతులు వర్షాధార పంటలను విత్తుకోవాలని సూచించార
నేడు ఖాతాల్లోకి ‘రైతుబంధు’
RELATED ARTICLES