ప్రజాపక్షం / హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. సాయంత్రం 5 గం.లకు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాలను ప్రకటించనున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఈ ఫలితాలను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి విడుదల చేస్తారని తెలిపారు. ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 16 వరకు జరిగాయి. ఈ పరీక్షలకు సుమారు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
ఫలితాలను https://tsbie.cgg.gov.in, www.bie.telangana.gov.in, www.exam.bie.telangana.gov.in. http://bie.tg.nic.inలలో తెలుసుకోవచ్చ ని ఆయన తెలిపారు.
నేడు ఇంటర్ ఫలితాలు
RELATED ARTICLES