దుబాయ్ లో భారత్ రికార్డ్
ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి రంగం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఈ మెగా టోర్నీకి తెరలేవనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో పాకిస్థాన్ ఈ టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. బుధవారం పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య జరిగే తొలి మ్యాచ్ ఈ టోర్నీ ప్రారంభం కానుంది. ఆటగాళ్ల భద్రతా కారణాలతో పాకిస్థాన్ పర్యటించేందుకు భారత్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్ నిర్వహించేలా ఐసీసీ.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ)ని ఒప్పించింది. దాంతో భారత్ మ్యాచ్ దుబాయ్ వేదికగానే జరగనున్నాయి. ఒకవేళ భారత్ సెమీఫైనల్, ఫైనల్ చేరితే ఆ మ్యాచ్ కూడా దుబాయ్ వేదికగానే జరగనున్నాయి.
రేపు భారత్ తొలి పోరు..
ఫిబ్రవరి 20న బంగ్లాదేశ్ జరిగే తొలి మ్యాచ్ టీమిండియా తమ క్యాంపైన్ ప్రారంభించనుంది. ఫిబ్రవరి 23న పాకిస్థాన్ హైఓల్టేజ్ మ్యాచ్ ఆడనున్న టీమిండియా.. మార్చి 2న న్యూజిలాండ్ చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది. 2013లో చివరిసారిగా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత్.. 2017లో తృటిలో టైటిల్ చేజార్చుకుంది. పాకిస్థాన్ జరిగిన ఫైనల్లో కోహ్లీ సారథ్యంలోని టీమిండియా ఓటమిపాలైంది. ఈసారి పటిష్టంగా ఉన్న టీమిండియా.. ఆ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది.
ఒకే వేదికలోనే భారత్ మ్యాచ్
ఈ టోర్నీలో టీమిండియా విజయం సాధించాలంటే వరుసగా ఐదు మ్యాచ్ గెలవాలి. లీగ్ దశలో మూడు మ్యాచ్ గెలవడంతో పాటు సెమీస్, ఫైనల్ గెలిస్తేనే టైటిల్ దక్కుతుంది. ఒక్క మ్యాచ్ ఓడినా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిందే. అందుకే ఛాంపియన్స్ ట్రోఫీని నాకౌట్ టోర్నీ అంటారు. భారత్ మ్యాచ్ దుబాయ్ ఒకే వేదికగా జరగనుండటం కలిసొచ్చే అంశం. ఇతర జట్లలా ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. పిచ్ కండిషన్స్ రీ్ చేయాల్సిన పరిస్థితి ఉండదు. ఒకసారి అలవాటు పడి లీగ్ దశలో మెరుగ్గా రాణిస్తే.. సెమీస్, ఫైనల్లో టీమిండియాకు దుబాయ్ హోమ్ గ్రౌండ్ మారనుంది.
టీమిండియా ట్రాక్ రికార్డ్ సూపరో సూపర్..
ఇక దుబాయ్ టీమిండియాకు మెరుగైన రికార్డ్ ఉండటం కలిసొచ్చే అంశం. మూడు ఫార్మాట్లలో కలిపి ఇక్కడ మొత్తం 15 మ్యాచ్ ఆడిన టీమిండియా 10 విజయాలతో పాటు 4 పరాజయాలను నమోదు చేసింది. మరో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. వన్డేల్లో అయితే టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడలేదు. దుబాయ్ ఇప్పటి వరకు 6 వన్డేలు ఆడిన టీమిండియా ఐదింటిలో గెలిచింది. ఒక మ్యాచ్ టై అయ్యింది. అది కూడా 2018 ఆసియా కప్ అఫ్గానిస్థాన్ జరిగిన మ్యాచ్ స్కోర్లు టై అయ్యాయి.
అతనే టాప్ బౌలర్..
దుబాయ్ వేదికగా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 68.40 సగటుతో 342 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత రోహిత్ 105.66 సగటుతో 317 పరుగులు చేశాడు. ఇందులో సెంచరీతో పాటు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దుబాయ్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో కుల్దీప్ యాదవ్ టాప్ ఉన్నాడు. అతను 4.08 ఎకానమీతో కుల్దీప్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టాడు. రవీంద్ర జడేజా 2018 ఆసియా కప్ బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్ 4/29 అత్యుత్తమ బౌలింగ్ గణంకాలు నమోదు చేశాడు.