మూడు రోజుల పాటు లోక్‌సభ స్థానాల వారీగా భేటీలు
10వ తేదీలోగా కొత్త డిసిసి అధ్యక్షుల నియామకం
పంచాయతీ, పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహం
ప్రజాపక్షం/హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం 15 రోజుల పాటు మౌనంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు పంచాయతీ, పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించింది. గాంధీభవన్‌లో శుక్రవారం నుంచి మూడు రోజులపాటు పార్లమెం టు స్థానం వారీగా సమీక్షా సమావేశాలను నిర్వహించనుంది. ఢిల్లీలో గురువారం రాహుల్‌గాంధీతో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఆర్.సి కుంటియా, టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డిలు భేటీ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి ఎన్నికల సమీక్షకు, రాబోయే ఎన్నికల సన్నద్ధమై సమావేశాలు నిర్వహించనున్నారు. ముగ్గరు ఎఐసిసి ఇన్‌ఛార్జ్ కార్యదర్శులకు గతంలో కేటాయించిన పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు చే యనున్నట్టు పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం నాడు ఎఐసిసి కార్యదర్శి శ్రీనివాసన్ కృష్ణన్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్, జహీరాబాద్, వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గాల సమీక్షలు జరగనున్నాయి. మధ్యాహ్నం 2 గం టల నుంచి ప్రతి గంటకు ఒక పార్లమెంట్ చొప్పున సాయంత్రం 7 గంటలకు వరకు ఈ సమావేశాలు జరుగుతాయి. శనివారం నాడు ఎఐసిసి కార్యదర్శి సలీం అహ్మద్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న నాగర్ కర్నూల్, మహబూబాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్షలు జరగున్నాయి. ఉద యం 11 గంటల నుంచి ప్రతి గంట కు ఒక పార్లమెంట్ నియోజకవర్గం చొప్పున సాయం త్రం 5 గంటల వరకు స మీక్షలు నిర్వహిస్తారు. అలాగే సోమవారం నాడు 7వ తేదీన ఎఐసిసి కార్యదర్శి బోసు రాజు ఇన్‌ఛార్జ్‌గా మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, మెదక్, చేవెళ్ల నియోజకవర్గాల సమీక్షలు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగనున్నాయి.
ఈ సమీక్ష సమావేశాలలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లోతుగా చర్చ ఉంటుందని, అలాగే ఇప్పటికే గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన నేపథ్యంలో ఆ ఎన్నికలపై చర్చ ఉంటుందని, రాబోయే పార్లమెంట్ ఎన్నికలపైన పరిశీలన ఉంటుందని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కొత్తగా ఏర్పడ్డ 33 జిల్లాలలకు కొత్త డిసిసి అధ్యక్షులను నియమించేందుకు కూడా కసరత్తు చేయనున్నట్లు చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో టిపిసిసి ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి ఆర్.సి కుంటియాతో పాటు ఆయా ఇంచార్జ్ ఎఐసిసి కార్యదర్శులు, డిసిసి అధ్యక్షులు, ఇటీవల పోటీ చేసిన అసెంబ్లీ అభ్యర్థులు, ఆయా పార్లమెంట్ పరిధిలోని ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు, ఎఐసిసి నాయకులు పాల్గొంటారని ఆయన తెలిపారు.