18న బడ్జెట్ ప్రతిపాదన
20నుంచి పద్దులపై చర్చ
ప్రజాసమస్యలు, బడ్జెట్ కేటాయింపులు, కొవిడ్‌పై ప్రభుత్వ చర్యలను ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు సిద్ధం
ప్రజాపక్షం / హైదరాబాద్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు ఉదయం 11 గంటలకు శాసనసభ, శాసనమండలి ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ప్రసంగిస్తారు. ఈనెల 18న ఉద యం 11.30 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఆ మరుసటి రోజు 19న అసెంబ్లీకి సెలవు. తిరిగి 20న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ, అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ, పద్దులపైన చర్చ జరుగుతుంది. ఈ నెల 27 వరకు బడ్టెట్ సమావేశాలను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ సమావేశంలో ప్రజాసమస్యలు, బడ్జెట్ కేటాయింపులు, కొవిడ్ నేపథ్యంలో ప్రభుత్వ చర్య లు తదితర అంశాలను ప్రతిపక్షాలు ప్రస్తావనకు తీసుకురానున్నాయి. అలాగే ప్రతిపక్షాలకు దీటుగా అధికార టి ఆర్‌ఎస్ సమాధానం చెప్పేందుకు సన్నద్ధమవుతోంది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ సహకారం, నిధుల కేటాయింపుల అంశాన్ని టిఆర్‌ఎస్ సభ్యు లు లేవనెత్తే అవకాశాలు ఉన్నాయి. సమావేశాల తొలి రోజు శాసనమండలి, శాసనసభల బిఎసి వేర్వురుగా సమావేశమై బడ్జెట్
నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
RELATED ARTICLES