‘మన ప్రజా వైద్యులు’ పుస్తకావిష్కరణలో వక్తలు
ప్రజాపక్షం/హైదరాబాద్ స్వాతంత్య్ర సంగ్రామంలో అలుపెరగని పోరాటం చేసి, నేటికీ సమాజం కోసం తపించే ఏటుకూరి కృష్ణమూర్తిని నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పలువురు వక్తలు అన్నారు.ఏ నూరేళ్ళ ప్రాయంలోకి అడుగిడినా ఇప్పటికీ నవ యువకుడేనన్నారు. ఏటుకూరి కృష్ణమూర్తి 99 ఏళ్లు పూర్తి చేసుకొని, వందవ వసంతంలోకి అడుగిడిన సందర్భంగా ఆయన రాసిన ‘మన ప్రజా వైద్యులు’ పుస్తకావిష్కరణ సభ హైదరాబాద్‌లోని సిపిఐ రాష్ర్ట కార్యాలయం మఖ్దూంభవన్‌లో శనివారం
ఆదర్శం ఏటుకూరి జరిగింది. సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పుస్తకావిష్కరణ చేసి తొలి ప్రతిని జాతీయ కార్యదర్శి కె. నారాయణకు అందచేశారు. సభకు సిపిఐ రాష్ర్ట కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సురవరం సుధాకరరెడ్డి మాట్లాడుతూ ఏటుకూరి కృష్ణమూర్తి వందవ ఏటలోకి అడుగుపెట్టడం అభినందనీయమన్నారు. స్వాతంత్య్ర సంగ్రామంలో చిన్న వయస్సులోనే పాల్గొని బ్రిటీష్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. జాతీయ ఉద్యమం పట్ల ఆకర్షితులై పనిచేశారని తెలిపారు. ఏటుకూరి బలరామ్మూర్తి గొప్ప తత్వవేత్త అని పేర్కొన్నారు. కృష్ణమూర్తి సైన్యంలో చేరి సేవలందించారన్నారు. సర్వీస్ కమిషన్ ఉద్యోగ విరమణ చేసిన తరువాత కమ్యూనిస్టుపార్టీ, దాని అనుబంధ ప్రజాసంఘాలలో పనిచేశారని గుర్తు చేశారు. ఆరోగ్యం, జీవితం సహకరిస్తున్న క్రమంలోనే నిరంతరం గ్రంథస్తం చేస్తున్నారని, సామాజిక చైతన్యాన్ని రగిలిస్తున్నారని అన్నారు. కె.నారాయణ మాట్లాడుతూ సుదీర్ఘ అనుభవం కలిగిన కృష్ణమూర్తి మధ్యలో తానుండటం నిజంగా ధన్యజీవినన్నారు. పార్టీ కార్యక్రమంలో నిబద్ధతతో పాల్గొని పనిచేశారని తెలిపారు. మానవజీవితం గొప్పదని, పవిత్రమైందని కృష్ణమూర్తి జీవిత చరిత్ర ఆదర్శనీయమన్నారు. చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ ఏటుకూరి కుటుంబం విజ్ఞాన కోవిధుల కుటుంబమని, నిత్యం జ్ఞానజ్యోతులు వెలుగిస్తున్నారన్నారు. సంపూర్ణ జీవితం గడుపుతూ కృష్ణమూర్తి మన మధ్య ఉండటం ఆనందదాయకమన్నారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ మార్కిస్టు దక్ఫథంతో సమసమాజ నిర్మాణం కోసం పనిచేస్తూ గ్రంథాలు రాయడం అభినందనీయమన్నారు. సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరరావు, సిపిఐ జాతీయ కార్యవర్గసభ్యులు సయ్యద్ అజీజ్‌పాషా, ఇప్టా జాతీయ ఉపాధ్యక్షులు కందిమళ్ళ ప్రతాపరెడ్డి, సిపిఐ తెలంగాణ రాష్ర్ట సమితి సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావు, నవచేతన విజ్ఞాన సమితి సంపాదకులు ఏటుకూరి ప్రసాద్ మాట్లాడుతూ ఉవ్వెత్తున సాగుతున్న స్వాతంత్య్ర సంగ్రామంలో ఏటుకూరి కృష్ణమూర్తి ముందుండి పోరాడారన్నారు. ఆయన ఆదర్శకమ్యూనిస్టు అని ప్రశంసించారు. తొలుత అరసం నాయకులు పెనుగొండ లక్ష్మినారాయణ స్వాగతోపన్యాసం చేస్తూ పదమూడేళ్ల ప్రాయంలోనే అరుణపతాకం చేబూని జొన్నలగడ్డ రామలింగయ్య స్ఫూర్తితో ముందుకుసాగారని గుర్తుచేశారు. ఏటుకూరి కృష్ణమూర్తి మాట్లాడుతూ స్వాతంత్య్ర సంగ్రామం నుండి మొదలుకొని నేటి వరకు ఎర్రజెండ చేబూని ముందుకుసాగుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏటుకూరి కృష్ణమూర్తిని సురవరం సుధాకర్‌రెడ్డి, తదితరులు ఘనంగా సన్మానించారు. అంతకుముందు అతిథులను నిర్వాహకులు ఆత్మీయసత్కారం చేశారు. ఈ కార్యక్రమంలో ఏటుకూరి కృష్ణమూర్తి తనయులు శ్రీనివాస మూర్తి, భరద్వాజ, కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మీయులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
నేటి తరానికి ఆదర్శం ఏటుకూరి
RELATED ARTICLES