4-1తో ఘన విజయం, హాకీ ప్రపంచకప్
భువనేశ్వర్: పురుషుల హాకీ ప్రపంచకప్‌లో నాలుగో ర్యాంక్ నెదర్లాండ్స్‌ను ఆరో ర్యాంక్ జర్మనీ షాకిచ్చింది. బుధవారం జరిగిన పూల్-డి మ్యాచ్‌లో జర్మనీ 4-1 తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసింది. వరసగా రెండు విజయాలు సాధించి తమ పూల్‌లో 6 పాయింట్లతో అగ్రస్థానంతో నాకౌట్‌కు చెరువైంది. మరోవైపు నెదర్లాండ్స్ 3 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్‌కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ర్యాంకింగ్స్‌లో తమకంటే బలహీనంగా ఉన్న జర్మనీ చేతిలో ఓటమిపాలై నాకౌట్ స్టేజ్ ఆశలను క్లిష్టం చేసుకుంది. ఇక్కడి కళింగ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆరంభంలో నెదర్లాండ్స్ దూకుడును ప్రదర్శిస్తూ 13వ నిమిషంలోనే తొలి గోల్ నమోదు చేసింది. నెదర్లాండ్స్ ఆటగాడు వెర్గ వాలెంటీన్ అద్భుతమైన గోల్‌తో తమ జట్టుకు తొలి గోల్ అందించాడు. తర్వాత రెండు జట్లు మరో గోల్ కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. ఒకరి గోల్ పోస్టుపై మరొకరు వరుస దాడులు చేస్తూ మ్యాచ్‌ను హోరెత్తించారు. 30వ నిమిషంలో జర్మనీ ఆటగాడు ముల్లర్ కళ్లు చెదిరే గోల్‌తో తమ జట్టు ఖాతా తెరిచాడు. దీంతో ఇరు జట్ల స్కోరు 1-1తో సమమైంది. చివర్లో మరింతగా రెచ్చిపోయిన జర్మనీ ఆటగాళ్లు ఆరు నిమిషాలో వ్యవధిలోనే వరుసగా మూడు గోల్స్ కొట్టి సంచలనం సృష్టించారు. (52వ) నిమిషంలో వైన్డ్‌ఫెడర్, (54వ) నిమిషంలో మార్కొ, (58వ) నిమిషంలో క్రిస్టోఫర్ అద్భుతమైన గోల్స్ చేయడంతో జర్మనీ 4-1తో భారీ ఆధిక్యంలో దూసుకెళ్లింది. తర్వాత మ్యాచ్ పూర్తి సమయం ముగిసే వరకు మరో గోల్ సాధ్యపడక పోవడంతో జర్మనీ గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది.
మలేషియా, పాకిస్థాన్ మ్యాచ్ డ్రా…
పూల్-డిలో భాగంగా జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్థాన్ 1-1తో మలేషియాతో డ్రా చేసుకుంది. నాలుగు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన పాకిస్థాన్ మరోసారి పేలవమైన ఆటను ప్రదర్శించింది. 51వ నిమిషంలో పాకిస్థాన్ తరఫున అతీఖ్ ముహమ్మద్ గోల్ చేసి తమ జట్టును ఆధిక్యంలో తీసుకెళ్లాడు. తర్వాత 55వ నిమిషంలో మలేషియా ఆటగాడు సారి ఫైజల్ తొలి గోల్‌తో ప్రత్యర్థి స్కోరును సమం చేశాడు. తర్వాత మరో గోల్ కోసం ఇరు జట్లు ఎంతగానే ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. ప్రపంచకప్‌లో భాగంగా గురువారం జరిగే పూల్-ఎ మ్యాచుల్లో స్పెయిన్‌తో న్యూజిలాండ్, ఫ్రాన్స్‌తో అర్జెంటీనా తలపడనున్నాయి.
నెదర్లాండ్స్‌కు జర్మనీ షాక్
RELATED ARTICLES