రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి l ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
ప్రజాపక్షం / హైదరాబాద్‌లోని ఔటర్‌రింగ్ రోడ్డు నెత్తురోడిం ది. ఒకే రోజు రెండు చోట్ల జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందగా.. మరో ఐదుగురికి పైగా గాయపడ్డారు. శామీర్‌పేట్ వద్ద వేగం గా వెళ్తున్న లారీ అదుపు తప్పి.. కారు, బొలెరోను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెం దారు. పటాన్‌చెరు వద్ద టైల్స్ లోడ్‌తో వెళ్తున్న మినీ డిసిఎం బోల్తాపడి ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. అలాగే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బహదూర్‌పల్లి టెక్ మహేంద్ర మలుపు వద్ద జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు మృతి చెందారు. వెళితే… మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ పరిధిలో ఉన్న ఔటర్ రింగ్‌రొడ్డుపై సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపుతప్పి డివైడర్ పైనుంచి ఎగిరి అటుగా వస్తున్న బొలెరో, కారును ఢీకొంది. ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఒకరిని ఇబ్రహీంపట్నం మండలం రాయపోలుకు చెందిన నర్సింహ్మగా గుర్తించారు. అదే విధంగా బీహార్ రాష్ట్రానికి చెందిన సుబాష్ పాశ్వన్(27), షాద్‌నగర్‌కు చెందిన లారీ క్లీనర్ నల్లబొతుల వినయ్(22) అక్కడిక్కడే మృతి చెందారు. బొలెరో వాహనంలో నలుగురు వ్యక్తులు ఉండగా అందులో ఇద్దరు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. లారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు శివారు వద్ద కూడా ఔటర్‌రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. టైల్స్ లోడ్‌తో వెళ్తున్న మినీ డిసిఎం టైరు పేలటంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వట్టినాగులపల్లి నుంచి బొల్లారం పారిశ్రామిక వాడలో నూతనంగా నిర్మిస్తున్న పరిశ్రమకు గ్రానైట్ తీసుకెళ్తుండగా ముత్తంగి కూడలికి కొద్ది దూరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదంలో బీహార్‌కు చెందిన అనిల్ సదా, దర్పేందర్ అనే ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడి అక్కడే మృతి చెందారు. రవీందర్,రాంబాలక్ స్వామి అనే మరో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం పటాన్ చెరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఔటర్ రింగ్‌రోడ్డుపై వేగ పరిమితి 100 కిలోమీటర్లు ఉండగా.. ఇటీవల దీనిని ప్రభుత్వం 120 కిలోమీటర్లకు పెంచింది. ఈ మార్పుల తరువాత ప్రమాదాలు పెరుగుతుండటం గమనార్హం. గరిష్ఠ వేగం 120కి పెంచినా.. వాహనదారులు స్వీయ నియంత్రణ పాటించాలని, మితిమీరిన వేగంతో విలువైన ప్రాణాలు పోగొట్టుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
దుండిగల్ ప్రమాదంలో ఇద్దరు మృతి
అలాగే దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బహదూర్‌పల్లి టెక్ మహేంద్ర మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. గండి మైసమ్మ నుంచి జీడిమెట్ల వైపు అతి వేగంగా, నిర్లక్ష్యంగా ద్విచక్ర వాహనం మీద వస్తున్న యువకులు.. బైక్ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీ కొట్టారు. ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతులు షాపూర్‌నగర్‌కు చెందిన యువరాజ్, ప్రైవేట్ ఉద్యోగి నాయుడుగా పోలీసులు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు.
నెత్తురోడిన ఒఆర్‌ఆర్
RELATED ARTICLES