దేశ భాష లం దు తెలుగు లెస్స అనే నా నుడి నిజ మైంది. అవధా న ప్రక్రియ సొం తం చేసు కున్న భాష అ లాంటి భాషలో పద్యం, గద్యం, వచనం ఇలా ఎన్నో రకా లుగా ప్రక్రియ లు వచ్చాయి. ముఖ్యంగా గురజాడ అప్పారావు గా రి ముత్యాల సరాలు, ఆరుద్ర గారి కూనలమ్మ పదాలు, అలిశెట్టి ప్రభాకర్ గారి మినీ కవితలు ఆచార్య గోపి గారి నానీలు ఇలా ….. ఎన్నో రక రకాల ప్రక్రియలు వచ్చాయి అదే కోవకు చెందిన నూతన కవితా ప్రక్రియ కైతికములు. ప్రక్రియ సృష్టి కర్త కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌కు చెందిన గోస్కుల రమేశ్. ఈ ప్రక్రియ ప్రారంభించిన 25 రోజుల లోనే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన దాదాపు 60 మంది కవులు అనుభవం కలిగిన వారు , నూతన కవులు కవితలు రాసి అనేక పత్రికలలో ప్రముఖ దినపత్రిక ఈనాడులో రోజు ఒకటి మంచిమాట వారేవ్వా అనే శీర్షికతో చైతన్య కలం అనే పేరుతో ప్రచురించారు , గణేష్ అనే ప త్రికలో దాదాపు ప్రతిరోజూ ఎవరిదో ఒకరు రాసిన కైతికములు దర్శనమిస్తున్నాయి 10 మంది వరకు శతకాలు పూర్తి చేసినారు వాట్సాప్ గ్రూప్‌లో రా స్తూ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్తున్నారు మ నం వివిధ ప్రక్రియల లక్షణాలు చూసినట్లైతే గురజాడ అప్పారావు ముత్యాల సరాలు
గేయ సరళిలో సాగి నాలుగు పాదాల నడకతో ఎం తగానో ఆకట్టుకున్నది.
ఉదాహరణ చూసినట్లైతే
దేశ మును ప్రేమించుమన్నా
మంచి యన్నది పెంచుమన్నా
వొట్టి మాటలు కట్టి పెట్టోయి
గట్టిమేలు తలపెట్ట వోయి
ఇలా చతురస్ర గతిలో సాగింది. ఆ తర్వాత చతు ర స్ర గతిలో వచ్చిన ‘ఆరుద్ర గారి కూనలమ్మ పదాలు’ ఇవి అంత్య ప్రాసలతో మకుటం కలిగి ముక్తకా లుగా వచ్చి ఎంతగానో ఆకట్టుకున్నాయి
ఉదాహరణ కు
పిల్ల నిచ్చన వారి
పీటమీద సవారి
చేయు అల్లుడె మారి
ఓ కూనలమ్మ అంటూ
మనసు కుదరని పెళ్లి
మరు దినమున కుళ్ళి
సుఖము హళ్ళికి హళ్ళి
ఓ కూనలమ్మ అంటూ
సామాజిక , నైతిక విలువలు పెంపొందించే విధం గా సృష్టించినారు. ఇది జన సామాన్యంలో
ఎంతగానో దూసుకు పోయిందనుటలొ ఎలాంటి అనుమానం లేదు.అదే విధంగా అలిశెట్టి ప్రభాకర్ గారి మినీ కవితలు వచ్చినవి.
అవి వచన ప్రక్రియలో సమాజంలో
బాగా నాటుకున్నాయి.
ఉదాహరణ పరిశీలించి చూస్తే
ఒక వేశ్యను గురించి చెబుతూ
తను శవమై
ఒకరికి వశమై
తనువు పుండై
ఒకడికి పండై
ఎప్పుడూ ఎడారై
ఎందరికో ఒయాసిస్సై,
ఇంకా కరువును గూర్చి చెబుతూ
ఎండదాటికి
చిన్న చిన్న
నీటి గుంటలే
ఎండి పోతుంటాయి
పెద్ద చెరువులు
మాత్రం మామూలే.
ఇలా చిన్న
పదాలలో ఎంతో భావుకత తో సమాజంలోని కుళ్ళు ను కడిగేసినవి.
ఆచార్య గోపి గారి నానీలు అనే ప్రక్రియ కూడా ఎక్కువగా పేరు గాంచింది.
నాలుగు పాదాల తో యుండి మొదటి రెండు పా దాల్లో సమర్థించుకోవడం లేదా చెణుకులాగా ఉండ డం 20 నుండి 25 అక్షరాలుండాలి.
ఉదాహరణ
వెన్నెల సత్యం గారి ప్రేమ నానీలు పుస్తకం లో
నింగి నేలా
అమర ప్రేమికులు
వాళ్ళది యుగ యుగాల
చూపుల భాష.
అని చెప్పడం జరిగింది
ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల లోని కవులు రాస్తు నటువంటి ప్రక్రియ కైతికములు. దీనిని సృష్టించిన వారు గోస్కుల రమేశ్ గారు,
కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలంలోని ఇప్ప ల్ నర్సింగాపూర్ గ్రామస్తుడు.
ఇప్పటివరకు జై తెలంగాణ వచన కవిత సంపుటి, యువతకు కరపత్రం లాంటి యువగీతం మరియు ఆటవెలది చందస్సు లో రాసిన
వెలుగు బాట శతకం, విను రమేశ్ మాట వెలుగు బాట అనే మకుటంతో రాసి పలువురి సాహితీ వే త్తల ప్రశంసలందుకున్నారు. పనిచేసే పాఠశాలలో విద్యార్థులచే కవితలు రాయించి బాల కవి సమ్మేళనం నిర్వహించారు
ప్రస్తుతం కైతికములు ప్రక్రియను సృష్టించి ఎందరో నూతన కవులు కలాన్ని కదిలిస్తున్నారనుట అతిశయోక్తి కాదు.
కైతికముల లక్షణాలు
1) ఇందులో 6 పాదాలు ఉంటాయి
2) 1 వ పాదము నుండి 4 వ పాదము వరకు 9,10,11,12 మాత్రలలో ఏవైనా తీసుకోవచ్చు
3) 2వ 4 వ పాదాల చివర అంత్య ప్రాసలుంటాయి
4) 5,6 వ పాదాల కు మాత్రనియమముండదు
5) 5 వ పాదము లో వారేవ్వా అని ప్రారంభించి వీరులు ,వనితలు, వ్యంగ్యాత్మక పదం ఏదైనా వాడవచ్చు.
6) 6వ పాదము కవితాత్మక పదంగానీ , జాతీయం గానీ,పదబంధం గానీ రావాలి.
ఉదాహరణకు
ఎదుటి వారి నెంచ
సిద్ధహస్తులు వీరు
తమను తామెంచగ
సాహసించలేరు
వారేవ్వా కొందరు
గురివింద గింజలు
కష్టాల తిమిరాలు
సుఖాల చుట్టీతే
కన్నీటి మేఘాలు
మనసును కమ్మితే
వారేవ్వా జీవితం
నిండు నరకయాతనం
రాయితో రువ్వినా
రవ్వంత చింతించవు
తీపి ఫలాలిచ్చుటలో
ఏమాత్రం వెనుకాడరు
వారేవ్వా తరువులు
బోధించు పాఠమిట్లు
సెల్ ఫోన్ వెబ్బులలో
చిక్కుకుంది బాల్యము
ఆరుబయట ఆటలను
మరిచింది చూడుము
వారేవ్వా బాల్యము
మారినట్టి చోద్యము
ఇలా ఎన్నో అద్భుతమైన కైతికములు రెండు వేలు దాటినవి. సృష్టి కర్త రమేశ్ మాట్లాడుతూ ఈ ప్ర క్రియ సమాజంలో మనిషి నిరంతరం చూస్తున్న సమస్యలను ముక్కు సూటిగా ప్రశ్నించడమే కాకు ండా చీకటి కోణాన్ని వ్యంగ్యంగా అందరికీ అర్థమ య్యే రీతిలో ఒక కామెంటరీగా కూడా పనిచేసి రాబోయే కాలంలో మంచి ప్రక్రియగా నిలుస్తుందని ఆయన చెప్పారు .
కరీంనగర్, సెల్. 7780185674