నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో పలు స్టాళ్లు దగ్ధం
పరుగులు తీసిన జనం ఘటనాస్థలిలో స్వల్ప తొక్కిసలాట
4 గంటల పాటు ఎగిసిపడిన మంటలు
హైదరాబాద్/సిటీ బ్యూరో: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌లో బుధవా రం రాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. వంద లాది స్టాల్స్ అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రతిష్టాత్మకమైన నుమాయిష్‌లో అగ్ని ప్రమాదం సంభవించడంతో సందర్శకులు ఉలిక్కిపడ్డారు. రాత్రి 8:30 గంటల ప్రాంతంలో ఒక బ్యాంక్‌కు చెంది న స్టాల్‌లో మంటలు మొదలైనట్లు పలువురు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. మరికొందరు గ్యాస్ సిలిండర్ పేలుడు వల్ల ప్రమాదం సంభవించిందని చెబుతున్నారు. మంటలు ఒక్కసారిగా ఎగిసిపడి శరవేగంగా ఇతర స్టాల్స్‌కు వ్యాపించాయి. అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో ఎగ్జిబిష న్ ప్రాంగణంలో ఏమి జరుగుందో అర్థంకాక గందరగోళ పరిస్థితి నెలకొంది.
నుమాయిష్‌లో భారీ అగ్నిప్రమాదం
RELATED ARTICLES