ప్రపంచ అథ్లెటిక్స్‌లో రజతం
యుజీన్ (ఆరెగన్/ అమెరికా): భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రా సరికొత్త చరిత్ర సృష్టించా డు. ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్స్ పురుషుల జావెలిన్ త్రోలో రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. భారత్ తరఫున ఈ చాంపియన్‌షిప్స్ పురుషుల విభాగంలో పతకం సాధించిన తొలి వ్యక్తిగా, మొత్తం మీద రెండో అథ్లెట్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు. అంతకు ముందు మహిళల లాంగ్ జంప్‌లో అంజూ బి. జార్జి కాంస్య పతకం గెల్చుకుంది. భారత్‌కు తొలి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. సుమారు 19 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌కు నీజర్ పతకాన్ని సాధించిపెట్టాడు. అతను జావెలిన్‌ను 88.13 మీటర్ల దూరానకి విసిరి, రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా) 90.54 మీటర్లతో స్వర్ణ పతకాన్ని గెల్చుకోగా, చెక్ రిపబ్లిక్ అథ్లెట్ జాకుబ్ వాడ్లెచ్ 88.09 మీటర్లతో కాంస్య పతకాన్ని సొంతం తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే ఈవెంట్లో పోటీపడిన మరో భారతీయుడు రోహిత్ యాదవ్ 78.72 మీటర్ల దూరానికి జావెలిన్‌ను విసిరి, పదో స్థానంతో సంతృప్తి చెందాడు. హీట్స్‌లో అతని అత్యుత్తమ ప్రదర్శన 80.42 మీటర్లు కావడం గమనార్హం. క్వాలిఫయింగ్ రౌండ్స్‌తో పోలిస్తే ఫైనల్స్‌లో విఫలం కావడానికి ఒత్తిడే ప్రధాన కారణమై ఉంటుందని క్రీడా నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. పారిస్ (ఫ్రాన్స్)లో జరిగిన 2003 ప్రపంచ అథ్లెటిక్స్ మహిళల లాంగ్ జంప్ ఈవెంట్లో అంజూ బి. జార్జి 6.70 మీటర్ల దూరానికి లంఘించి కాంస్య పతకం సంపాదించింది. అప్పటి వరకూ భారత్‌కు ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఒక్క పతకం కూడా లభించలేదు. ఆ లోటును అంజూ పూర్తి చేసింది. యునిస్ బార్బర్ (ఫ్రాన్స్/ 6.99 మీటర్లు), తాత్యానా కొత్నా (రష్యా/ 6.74) వరుసగా స్వర్ణ, రజత పతకాలను గెల్చుకున్నారు. వారికి గట్టిపోటీనిచ్చినప్పటికీ అంజూకు కాంస్యంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది. ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్ మరో పతకాన్ని సంపాదించడానికి సుమారు రెండు దశాబ్దాల కాలం పట్టింది. క్రికెట్ మోజులో కొట్టుకుపోతున్న ప్రజలు, అధికారుల నిరాదరణ ఏ స్థాయిలో చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం మరొకటి ఉండదు. నీరజ్ చోప్రా 2018లో అర్జున, 2020లో విశిష్ట సేవా మెడల్ (విఎస్ఎం), 2021లో భారత క్రీడా రంగ అత్యున్నత పురస్కారం ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న, 2022లో పరమ్ విశిష్ట సేవా మెడల్ (పివిఎస్ఎం), పద్మశ్రీ పురస్కారాలు అందుకున్నాడు. అతని జైత్రయాత్ర 2016 ఆసియా జూనియన్ చాంపియన్‌షిప్స్ నుంచి మొదలైంది. ఆ పోటీల్లో రజత పతకాన్ని సంపాదించిన అతను, అదే ఏడాది పోలాండ్‌లో జరిగిన ప్రపంచ జూనియన్ అథ్లెటిక్స్‌లో స్వర్ణ పతకం సాధించాడు. అనంతరం దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణం, 2018లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణం, 2018లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం, అదే ఏడాది ఆసియా క్రీడల్లో స్వర్ణం సంపాదించాడు. టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం గెల్చుకోవడం ద్వారా యావత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు
నీరజ్ సూపర్ షో
RELATED ARTICLES