నీమచ్ : మధ్యప్రదేశ్‌లోని నీమచ్ మండిలో ఉల్లి, వెల్లుల్లి ధరలు 50 నుంచి 90 పైసలు పడిపోయాయి. కిలోకు రూ.2 మాత్రమే పలుకుతున్నాయి. దీంతో రైతుల్లో తీవ్రం ఆందోళన కలుగుతోంది. ధరలు తీవ్రంగా పడిపోవడంతో కొంతమంది రైతులు తమ పంటను అమ్ముకోకుండానే వెనుదిరుగుతుండగా, మరికొంత మంది మార్కెట్లోనే వాటిని పారబోస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిల్వల్లో భాగం గా దాచిన నాసిరకం పంటను పెద్ద ఎత్తున మార్కెట్‌కు తరలిస్తుడండం వల్లే ధరలు పడిపోవడాని కి ప్రధానకారణమని ఓ అధికారి అభిప్రాయపడ్డారు. సోమవారం ఉల్లిధర క్విం టాల్‌కు రూ.90 నుంచి రూ. 900 మధ్య పలకగా, వెల్లుల్లి ధర క్వింటాల్‌కు రూ. 200 నుంచి రూ. 3900 వరకు పలికినట్లు నీమచ్ మండి కార్యదర్శి సంజీవ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. పంట నాసిరకంగా ఉండడంతో కేవలం కొద్ది మాత్రమే తక్కువ ధర పలికిందన్నారు. హోల్‌సేల్‌గా ఉల్లి ధర కిలోకు 90 పైసలు పలకగా, వెల్లుల్లి ధర కిలోకు రూ. 2 పలికినట్లు మండి అధికారులు అంచనా వేశారు. అయితే సోమవా రం సగటున ఉల్లి ధర క్వింటాల్ రూ. 600 ఉండగా, వె ల్లుల్లి రూ. 1000గా ఉందని శ్రీవాత్సవ చెప్పారు. దాదా పు 5000 క్వింటాళ్ల ఉల్లి, 8000 క్వింటాళ్ల వెల్లుల్లి మార్కెట్ వచ్చిందన్నారు.
నీమచ్ మండిల్లో ఒక్కసారిగా పడిపోతున్న ఉల్లి, వెల్లుల్లి ధరలు
RELATED ARTICLES