ప్రజాపక్షం/పాపన్నపేట ఈత కోసం వెళ్ళి ఇరువురు మృతువుడిలోకి చేరుకొన్న సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని ఏడుపాయల చెక్ డ్యాం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, కుటింబీకుల సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మనోహరాబాద్ మండల పరిధిలోని దండుపల్లి గ్రామానికి చెందిన పిట్టల జైహింద్ (36) తమ కుటుంబ సభ్యులతో కలిసి ఏడుపాయల్లో విందుకు హాజరవడానికి వచ్చి స్నానాలు ఆచరించడానికని మంజీరా చెక్ డ్యాం వద్దకు వెళ్ళగా తన అన్న కుమారుడైన పిట్టల రాము (16) కూడా వెళ్ళి సరదాగా ఈత కొట్టేందుకు పూనుకుని చెక్ డ్యాం వద్ద ఈత కొట్టుతున్న క్రమంలో ప్రమాద వశాత్తు నీటమునిగిపోవడం తో ఈ విషయం గమనించిన స్థానికులు వెంటనే పాపన్నపేట పోలీసులకు సమాచారం అందివ్వడంతో సమాచారం అందుకున్న యస్‌ఐ విజయ్ కుమార్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీసి పంచనామా నిర్వహించి, మృతుడి కుమార్తె సోని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు యస్‌ఐ తెలిపారు. కాగా మృతుడు జైహింద్ కు భార్య లలిత తోపాటు కూతురు సోని ఉండగా మృతుడు రాము కు తండ్రి రాజేష్, తల్లీ అనితలు ఉన్నారు.
నీట మునిగి ఇద్దరు మృతి
RELATED ARTICLES