ప్రపంచవ్యాప్తంగా 100కిపైగా దేశాల్లో జనతా కర్ఫ్యూ
సకలం బంద్…రహదారులు నిర్మానుష్యం
బెర్లిన్: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్ 19) వాయువేగంతో చెలరేగుతుండటంతో ప్రపంచం యావత్తూ అప్రమత్తమైంది. ఇప్పటికే దాదాపు 200 దేశాలకు ఈ వ్యాధి పాకిన నేపథ్యంలో దీన్ని అదు పు చేసేందుకు శనివారంనాడు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ప్రాం తాలు జనతా కర్ఫ్యూను పాటించాయి. దాదాపు 100కి పైగా దేశాలు ఈ కర్ఫ్యూను పాటించినట్లుగా సమాచారం. కొన్ని దేశాల్లో ప్రభుత్వమే కర్ఫ్యూ విధించింది. వీధులు, రహదారులు నిర్మానుష్యమయ్యాయి. సక లం బందయింది. షాపింగ్ మాల్స్‌తోపాటు చిన్న షాపులు సైతం మూతపడ్డాయి. ఇక విద్యాసంస్థలు, సినిమా ధియేటర్లు, వినోద కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ప్రజలతో అనుబంధమున్న ప్రతి ప్రాంతానికీ తాళాలు పడ్డాయి. కొన్ని చోట్ల సెక్యూరిటీ గార్డులు సైతం లేరు. ఆరోగ్య వ్యవస్థలను దెబ్బతీసే విధంగా కరోనా విజృంభిస్తుండటంతో సా మాజిక దూరం అనివార్యమని దాదాపు అన్ని ప్రభుత్వాలు ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఈ కర్ఫ్యూ జరిగింది. అమెరికాలో ఏడు కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న మూడు రాష్ట్రాల్లో కాలిఫోర్నియా శుక్రవారమే ఈ జనతా కర్ఫ్యూను ప్రారంభించ గా, న్యూయార్క్, ఇల్లినాయిస్ శనివారం దీన్ని పాటించాయి. ఇక కనెక్టికట్, ఒరెగాం రాష్ట్రాలు కూడా ఈ తరహా చైతన్య కార్యక్రమానికి సిద్ధపడుతున్నాయి. జర్మనీలో ఇంట్లో వుండాలని ప్రజలకు చెప్పిన తొలి రాష్ట్రం బవేరియా. వైద్యులు, మీడియావాళ్లు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ స్టాఫ్ తప్ప ఏ ఒక్కరూ రోడ్డుపై కనబడలేదు. దక్షిణ అమెరికాలోని కొలంబియా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇక శ్రీలంకలో వారాంతంలో ముందు జాగ్రత్త చర్యగా అన్ని ఎక్స్‌ప్రెస్‌వేలను సైతం మూసివేసింది. ఆఫ్రికా ఖండం లో శనివారం నాటికి వెయ్యికిపైగా కొవిడ్ 19 కేసులు నమోదైనట్లు ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది.
నిశ్శబ్దగీతం!
RELATED ARTICLES