HomeNewsBreaking Newsనిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది

నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిది

‘గౌరవెళ్లి’ రైతులపై లాఠీచార్జి అమానుషం
భూ నిర్వాసితులకు న్యాయం చేయాలి
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/అక్కన్నపేట గౌరవెళ్లి రిజర్వాయర్‌ ముంపు నిర్వాసితుల త్యాగం వెలకట్టలేనిదని, ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులకు తక్షణమే న్యాయం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గుడాటిపల్లి వద్ద నిర్మిస్తున్న గౌరవెళ్లి రిజర్వాయర్‌ ముంపు నిర్వాసితులు చేపట్టిన నిరసన దీక్షలకు ఆయన సంఘీభావం తెలిపారు. నిర్వాసిత రైతులతో పాటు గ్రామ సర్పంచ్‌ బద్దం రాజిరెడ్డి, ఎంపిటిసి బైరి రవీందర్‌తో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పలువురు నిర్వాసితులు తమకు న్యాయం జరగలేదని వినతిపత్రాలు అందించారు. వాటిని ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడు తూ తాను ఎమ్మెల్యేగా వున్నప్పుడు గౌరవెళ్లి రిజర్వాయర్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఏళ్లు గడుతున్నా ప్రాజెక్టు పూర్తి కాలేదని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టు సామర్థ్యం 1.7 టిఎంసిలు ఉండగా, తెలంగాణ ఏర్పడ్డాక 8.29 టిఎంసిలకు పెంచారన్నారు. దీనివల్ల ఇక్కడి రైతులు రెండు సార్లు భూములు కోల్పోయారన్నారు. సరైన పరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పరిహారం విషయమై పలుమార్లు ముఖ్యమంత్రికి లేఖ ద్వారా నివేదించినట్లు పేర్కొన్నారు. నిర్వాసిత రైతాంగానికి తాను అండగా వుంటానని భరోసానిచ్చారు. సమస్యల పరిష్కారానికి భూనిర్వాసితులు ఐక్యతతో ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు తమ సర్వస్వాన్ని కోల్పోతున్న వారికి ప్రభుత్వం సరైనా సమయంలో న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రాజెక్టు పనులను అడ్డుకున్న గౌరవెళ్లి రిజర్వాయర్‌ ముంపు నిర్వాసిత రైతులు, మహిళలపై పోలీసుల లాఠీచార్జ్‌ని తీవ్రంగా ఖండించారు. సవత్సరాలు గడుస్తున్నా పునరావాసం, పరిహార చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌, స్థానిక ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ విఫలమయ్యారని విమర్శించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులు అర్ధాకలితో అలమటిస్తూ చివరకు పరిహారం అందక తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం సొంత ఇలాఖాలో పూర్తయిన కొండ పోచమ్మ,మల్లన్న సాగర్‌,రంగనాయక్‌ సాగర్‌ నిర్మాణాల్లో నిర్వాసితులకు ఏ విధంగా పరిహారం చెల్లించారో ఆ తరహాలోనే ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలన్నారు. పరిహారం చెల్లింపులో జాప్యం కారణంగా ప్రభుత్వంపై నమ్మకం పోతుందన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్వాసితులపైనే లాఠీచార్జ్‌ చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసు బలగాలతో ప్రాజెక్టు పనులు పూర్తిచేయలేరన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కరించకుంటే సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేయకుండా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద పవన్‌,మండల కార్యదర్శి ఎడల వనేష్‌ కొయ్యడ కొంరయ్య,కొమ్ముల భాస్కర్‌,వేల్పుల బాలమల్లు, జేరిపోతుల జనార్దన్‌,ఎగ్గోజు సుదర్శనచారి,జనగామ రాజ్‌కుమార్‌ తదితరులు వున్నారు.
సార్లు భూములు కోల్పోయారన్నారు. సరైన పరిహారం చెల్లించకపోవడంతో నిర్వాసితులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. పరిహారం విషయమై పలుమార్లు ముఖ్యమంత్రికి లేఖ ద్వారా నివేదించినట్లు పేర్కొన్నారు. నిర్వాసిత రైతాంగానికి తాను అండగా వుంటానని భరోసానిచ్చారు. సమస్యల పరిష్కారానికి భూనిర్వాసితులు ఐక్యతతో ధైర్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రైతులకు నీళ్లు ఇచ్చేందుకు తమ సర్వస్వాన్ని కోల్పోతున్న వారికి ప్రభుత్వం సరైనా సమయంలో న్యాయం చేయడం లేదని మండిపడ్డారు. నిర్వాసితుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ప్రాజెక్టు పనులను అడ్డుకున్న గౌరవెళ్లి రిజర్వాయర్‌ ముంపు నిర్వాసిత రైతులు, మహిళలపై పోలీసుల లాఠీచార్జ్‌ని తీవ్రంగా ఖండించారు. సవత్సరాలు గడుస్తున్నా పునరావాసం, పరిహార చెల్లింపు విషయంలో ముఖ్యమంత్రి కెసిఆర్‌, స్థానిక ఎమ్మెల్యే సతీష్‌కుమార్‌ విఫలమయ్యారని విమర్శించారు. భూములు కోల్పోయిన నిర్వాసితులు అర్ధాకలితో అలమటిస్తూ చివరకు పరిహారం అందక తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సిఎం సొంత ఇలాఖాలో పూర్తయిన కొండ పోచమ్మ,మల్లన్న సాగర్‌,రంగనాయక్‌ సాగర్‌ నిర్మాణాల్లో నిర్వాసితులకు ఏ విధంగా పరిహారం చెల్లించారో ఆ తరహాలోనే ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం చెల్లించాలన్నారు. పరిహారం చెల్లింపులో జాప్యం కారణంగా ప్రభుత్వంపై నమ్మకం పోతుందన్నారు. సమస్యలు పరిష్కరించాల్సిన ప్రభుత్వం నిర్వాసితులపైనే లాఠీచార్జ్‌ చేయడం సిగ్గుచేటన్నారు. పోలీసు బలగాలతో ప్రాజెక్టు పనులు పూర్తిచేయలేరన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కరించకుంటే సిపిఐ నేతృత్వంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఇప్పటికైనా నిర్వాసితులను భయబ్రాంతులకు గురిచేయకుండా వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద పవన్‌,మండల కార్యదర్శి ఎడల వనేష్‌ కొయ్యడ కొంరయ్య,కొమ్ముల భాస్కర్‌,వేల్పుల బాలమల్లు, జేరిపోతుల జనార్దన్‌,ఎగ్గోజు సుదర్శనచారి,జనగామ రాజ్‌కుమార్‌ తదితరులు వున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments