న్యూఢిల్లీ: నిర్భయ దోషులను వేర్వేరుగా ఉరి తీయాలంటూ కేంద్రం వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై అ త్యవసర విచారణ చేపట్టాలంటూ అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజ్ న్యాయమూర్తులు ఎన్‌వి రమణ, సంజీవ్ ఖన్నా, కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనాన్ని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను శుక్రవారం విచారిస్తామని జస్టిస్ ఎస్‌వి రమణ స్పష్టం చేశారు. ఉరి అమలుపై స్టే ఉంటే వాళ్లకు మరణశిక్ష విధించడం కుదరదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అందుకే స్టేను ఎత్తివేయాల్సిందిగా కేంద్రం కోరింది. దోషులకు విధించిన ఉరిశిక్ష అమలుపై దిగువ న్యాయస్థానం ఇచ్చిన స్టే ఉత్తర్వులను సవాలు చేస్తూ కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వాలు బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ లు చేసిన విషయం తెలిసిందే. నలుగురు దోషుల్లో కనీసం ఇద్దరిని ఉరి తీసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కేంద్రం తన పిటిషన్‌లో పేర్కొంది. న్యా యపరమైన హక్కులు(రివ్యూ పిటిషన్, క్యురేటివ్, క్షమాభిక్ష అభ్యర్థన) అన్నింటినీ వినియోగించుకున్న దోషులను ఉరి తీయాలని కేంద్రం కోరింది. ముఖేశ్, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనలను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరించారు. ఇక నలుగురు దోషుల్లో మిగిలిన పవన్ గుప్తా మాత్రం ఇప్పటి వరకు క్యురేటివ్, క్షమాభిక్ష పిటిషన్‌ను దాఖలు చేయలేదు.
నిర్భయ దోషుల విచారణ నేడే
RELATED ARTICLES