మూడోసారి నిలిచిన మరణశిక్ష అమలు
న్యూఢిల్లీ: నిర్భయ అత్యాచారం, హత్య కేసులో దోషుల ఉరితీత మరోసారి వాయిదా పడింది. నిర్భయ దోషుల ఉరిశిక్ష అమలుపై పాటియాల హౌస్ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు డెత్ వారెంట్లపై స్టే కొనసాగుతుందని తెలిపింది. వాస్తవానికి మంగళవారం ఉద యం (మార్చి 3న) ఉదయం 6.00 గంటలకు నలుగురు దోషులనూ ఉరి తీయాల్సి ఉంది. తమ డెత్ వారెంట్లపై స్టే ఇవ్వాలంటూ దోషుల్లో ఒకరైన పవన్ గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం స్టే విధించింది. ‘బాధితురాలి వైపువారి నుండి తీవ్ర ప్రతిఘటన ఉన్నప్పటికీ, ఏ దోషి కూడా తనకు తన దేశంలో న్యాయ అవకాశాలు లేకుండానే ఉరితీశారన్న ఫిర్యాదుతో సృష్టికర్తను కలవకూడదని నా అభిప్రాయం’ అని అదనపు సెషన్స్ జడ్జి ధర్మేందర్ రాణా చెప్పారు. ‘దోషి క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ఉరి అమలు సమంజసం కాదన్నది నా అభిప్రాయం. మార్చి 3న ఉదయం 6.00 గంటలకు ఉరితీయాల్సిన నలుగురి దోషుల డెత్ వారెంట్లను తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఆపేయాలని స్టే ఇస్తున్నాను’ అని కూడా న్యాయమూర్తి చెప్పారు. తమ ఉరితీత వారెంట్‌పై స్టే ఇవ్వాల్సిందిగా పవన్ గుప్తా పెట్టుకున్న పిటిషన్‌పై కోర్టు ఈ తాజా ఉత్తర్వులు జారీచేసింది. పవన్ గుప్తా సోమవారం రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకోవడంతో కోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చింది.
అక్షయ్ దరఖాస్తు కొట్టివేత
ఉరిశిక్షపై తాను మరోసారి రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నానని, అందువల్ల డెత్ వారెంట్‌పై స్టే ఇవ్వాలని కోరు తూ దోషుల్లో ఒకడైన అక్షయ్ పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన పాటియాల హౌస్ కోర్టు అక్షయ్ అభ్యర్థనను కొట్టివేసింది. మంగళవారం ఉరితీతపై స్టే ఇవ్వలేమని స్పష్టం చేసింది. అయితే ఇదే సమయంలో మరో దో షి పవన్ గుప్తా కూడా పిటిషన్ దాఖలు చేశాడు. పవన్ గతవారం సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేయగా.. సోమవారం సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో అతడు రాష్ట్రపతికి క్షమాభిక్ష అభ్యర్థన పెట్టుకున్నాడు. ఈ విషయాన్ని దోషి తరఫు న్యాయవాది ఎపి సింగ్ ఢిల్లీ కోర్టు దృష్టికి తెచ్చారు. క్షమాభిక్ష అభ్యర్థన రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న దృష్ట్యా ఉరితీతపై స్టే ఇవ్వాలని పవన్ న్యాయస్థానాన్ని కోరడంతో.. కోర్టు స్టే విధించింది.
పవన్ న్యాయవాదిని ప్రశ్నించిన కోర్టు
పోస్ట్ విచారణ సందర్భంగా పవన్ అభ్యర్థనపై ఢిల్లీ కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. క్యూరేటివ్, క్షమాభిక్ష పిటిషన్లు పెట్టుకోడానికి ఎందుకు ఆలస్యం చేశారని దోషి తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది. ‘మీరు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు. ఒక వ్యక్తి చేసే తప్పుడు చర్య వల్ల ఎలాంటి పరిణామాలు వస్తాయో మీకు తెలియదా?’అంటూ న్యాయవాది ఎపి సింగ్‌ని నిలదీసింది.
వాయిదా మూడోసారి..
దోషుల ఉరిశిక్ష అమలు వాయిదా పడడం ఇది మూడోసారి. నలుగురు దోషులూ ఒకరి తర్వాత ఒకరు తమకున్న న్యాయ అవకాశాలను వినియోగించుకోవడంతో మరణశిక్ష అమలు ఆలస్యమవుతోంది. తొలిసారి ఈ ఏడాది జనవరి 22న వారిని ఉరి తీయాలని పాటియాల హౌస్ కోర్టు డెత్ వా రెంట్లు జారీ చేసింది. నిందితులు న్యాయపరమైన అవకాశలు వినియోగించుకోవడంతో ఉరి అమలు వాయిదా పడింది. ఫిబ్రవరి 1న ఉరితీయాలని రెండోసారి డెత్ వారెంట్ జారీ చేసినప్పుడూ మళ్లీ అదే కారణంతో వాయిదా పడింది. మార్చి 3న ఉరి తీయాలని ఇటీవల ఇచ్చిన డెత్ వా రెంట్లపై తాజాగా మరోసారి స్టే విధించడం గమనార్హం. దోషులకు ఉన్న న్యా యావకాశాలన్నీ ఇంకా ముగిసిపోనందున కోర్టు వారి ఉరి అమలుపై స్టే వి ధించిందన్నది గ మనార్హం. నిర్భయ తల్లిదండ్రులు, ఢిల్లీ ప్రభుత్వం దోషులపై తాజా డెత్ వా రెంట్లు ఇవ్వాలంటూ పెట్టుకున్న పిటిషన్లను కోర్టు విచారించింది. గా పిలుస్తున్న 23 ఏళ్ల ఫిజియోథెరపీ ఇంటర్న్ వైద్య విద్యార్థినిని 2012 డి సెంబర్ 16న దోషులు అత్యాచారం చేసి తీవ్రంగా గాయపరిచారు. ఆమె సిం గపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడించిందన్నది తెలిసిన విషయమే.
నిర్భయ దోషుల ఉరిపై స్టే!
RELATED ARTICLES